Home » Punjab
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండా గిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ''అబ్ కీ బార్ 400 పార్'' నినాదంతో ఈసారి ఎన్నికల్లో దిగడం, ఇంతవరకూ జరిగిన ఆరు విడతల ఎన్నికలో దాదాపు లక్ష్యానికి చేరుకున్నామని క్లెయిమ్ చేసుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పందించారు. 400 సీట్ల క్లెయిమ్ ''బక్వాస్'' (నాన్సెన్స్) అని కొట్టిపారేశారు.
డేరా మాజీ అధికారి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను(Gurmeet Ram Rahim Singh) పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు 2002లో హత్య చేశారు.
స్వాతంత్య్ర పోరాటంలో పంజాబ్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎందరో ప్రాణత్యాగం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుర్తుచేశారు.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్.. జూన్ 1వ తేదీన జరగనుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తం కానుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ.. ఎవరికి వారు తమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో కూర్చుని పంజాబ్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్ సీఎం సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకున్నారని విమర్శించారు.
తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ కవ్వింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళాలు(BSF) చైనా ఎగరేసిన ఓ డ్రోన్‌ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.
భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కలిశారు.