Home » Punjab
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు మూడో రోజు కొనసాగుతోన్నాయి. రైతు నేతలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలో వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందల సంఖ్య రైతులకు గాయాలు అయ్యాయి.
శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. తాము పంజాబ్ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ హర్యానా వైపు నుంచి డ్లోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ వదులుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా పతంగులు ఎగురవేస్తున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు.
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై భాష్పవాయు ప్రయోగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద దిల్లీకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు
పదేళ్లలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని, ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నామని, బీజేపీ భయపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమో, ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఒంటరిగా కనిపించిన మహిళపై ఏకంగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి.
చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించేది లేదని, రిటర్నింగ్ అధికారి చేసిన పనికి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ఇతర కమిట్మెంట్ల రీత్యా పంజాబ్ గవర్నర్ పదవికి, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను అంగీకరించాలని పురోహిత్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు ప్రకటించిన కొద్ది సేపటికే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వంతపాడింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో 'ఆప్' ఒంటిరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది.
డ్రస్సు నుండి లిప్ట్సిక్ వరకు దేన్నీవదలకుండా అలంకరణ చేసుకున్నాడు. కానీ తీరా చేసింది ఈ పని..