Home » Puttaparthy
మండలంలోని దేవిరెడ్డిపల్లి మోడల్ స్కూల్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం టాటాఏస్, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా కురుకుమలై గ్రామానికి చెందిన డ్రైవర్ జ్యోతి(33) అక్కడికక్కడే మృతి చెందాడు.
స్పందనలో వచ్చే పిటీషన్లపై నిర్లక్ష్యం వద్దని, వాటిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాలశ్రీరామ్ పేర్కొన్నారు.
ఇళ్లు లేని పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలసి బైఠాయించారు.
గ్రీనఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. నాయనకోట, నాయనకోట తండా, వీరప్పగారిపల్లి, బొంతపల్లి, కొండతిమ్మయ్యగారిపల్లి రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. మండలవ్యాప్తంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. వన్యప్రాణులకు అక్కడ రక్షణ కరువైంది. నెమళ్లు, జింకలు ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామాలబాట పడుతున్నాయి.
ఇంకుడు గుంతలు భవిష్యత్తులో రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ తనూజ ఠాగూర్ పేర్కొన్నారు.
స్థానిక బస్టాండ్ వద్ద బుధవారం ద్విచక్రవాహ నం ఢీకొని తిమ్మగానిపల్లికి చెందిన ఆనందమ్మ(47) మృతిచెందింది.
మండలంలోని బూదిలి కోటిలింగేశ్వర స్వామి ఆలయ మాన్యం భూమి 4.09 ఎకరాలను వైసీపీ నాయకులు కబ్జాకు యత్నించారు. బీజేపీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు.
కాంట్రాక్టర్లు కుమ్మక్కై అభివృద్ధి పనులు చేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఆ రోపించారు.