Home » Rains
నగరంలోని రోడ్లపై రాళ్లుండొద్దని, గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్(Danakishore) ఆదేశించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకంలో భాగంగా చేపట్టి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు.
వరద సహాయక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండో రోజు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను తన కార్యాలయంగా మార్చుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 173 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది..
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, నెల్లికుదురు మండలం రావిరాలలో సీఎం పర్యటించాల్సి ఉండగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తాండా చేరుకోనున్నారు.
వరదనీటితో ఒలేరు కట్ట నిండుతోంది. కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రేపల్లె పట్టణ ప్రజలు సరక్షితం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రేపల్లె మండలంలో గల వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావి అనంతవరం, ఒలేరు గ్రామాల్లో అర్ధరాత్రి వరకు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి పర్యటించారు.
సుద్దగడ్డ పొంగింది.. వరద తీవ్రత పెరిగి మహోగ్రరూపం దాల్చింది. ఊళ్లను ఏర్లుగా మార్చేసింది. పంట పొలాలను నదుల్ని తలపించేలా చేసింది. చివరకు జాతీయ రహదారినీ ముంచేసింది.. వెరసి భారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా సుద్దగడ్డ పొంగడంతో జిల్లాలోని గొల్లప్రోలు మండలం వణికిపోయింది.
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు నిన్న(సోమవారం) విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయి వరదనీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.47లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో ఇదే రికార్డుస్థాయి వరద అంటూ జలవనరుల శాఖ, సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.
కుండబోత వర్షం.. ఫలితంగా ముంచెత్తిన వరద హోరు తగ్గాయి! అయితే అవి మిగిల్చిన విధ్వంసం.. ఇళ్లలో నిత్యావసరాలు సహా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన బడుగు జీవుల్లో నిండిన విషాదం ఎప్పుడు పోతుందనేది మాత్రం తెలియదు! ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి..
గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది.
రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు.