Home » Rains
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
భారీ వర్షాలకు బెజవాడ వణికిపోయింది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన జనాలు ఎంతో మంది ఉంటే.. నీళ్లు, అన్నం పెట్టి కాపాడంటూ మహాప్రభో అంటూ ఇళ్లలో ఇరుక్కుపోయిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో టిఫిన్లు, భోజనాలు లేక వరద బాధితులు అల్లాడుతున్నారు. విషయం తెలుసుకుని చలించిపోయిన సీఎం నారా చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి..
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల్లో వరద ప్రభావం, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, వరద ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది...
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంది. పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వరదలతో ముంచెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 9మందికి పైగా వరదల్లో చిక్కుకుని మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అయితే రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
వర్ష బీభత్సంతో అల్లాడుతున్న తెలంగాణ పల్లెలు, పట్టణాలు, నగరాలకు మరోసారి భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌తోపాటు 6 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు.
అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
ఇళ్ల పైకప్పులు.. పార్కులు.. రోడ్లు.. ఎక్కడంటే అక్కడ మొసళ్లు..! ఒక్కోటి 10 నుంచి 15 అడుగులు..!