Dams: భారీ వరదలకు తెలంగాణ ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..
ABN , Publish Date - Sep 02 , 2024 | 09:24 AM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంది. పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంది. పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.
నాగార్జున సాగర్..
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. పెద్దఎత్తున వరదనీరు చేరడంతో ప్రాజెక్టు 26గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,42, 279క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా.. ప్రస్తుతం 587.20అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 305.62టీఎంసీలు చేరింది.
మూసీ ప్రాజెక్టు..
నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 15,783క్యూసెక్కులు కాగా.. ప్రాజెక్టు నాలుగు గేట్లు 4అడుగుల మేర ఎత్తి 10,025క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.805టీఎంసీలకు చేరింది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా.. ప్రస్తుతం 642.45అడుగులకు చేరుకుంది.
భద్రాచలం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది 27.3 అడుగుల మేర ప్రవహిస్తోంది. తాలిపేరు ప్రాజెక్ట్ 25గేట్లు ఎత్తి 33,175క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 31,537క్యూసెక్కులుగా ఉంది.
స్వర్ణ ప్రాజెక్టు..
నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టుకు 9,000క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 2గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,183అడుగులు కాగా ప్రస్తుతం 1,183అడుగులకు చేరుకుంది.
జూరాల ప్రాజెక్టు..
మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోంది. ఇన్ ఫ్లో 3.75లక్షల క్యూసెక్కులు కాగా.. ప్రాజెక్టు 45గేట్లు ఎత్తి 4.10లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.952టీఎంసీలకు చేరుకుంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 318.516మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.660మీటర్లకు చేరుకుంది.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు..
మహబూబ్‌నగర్ జిల్లాలోని మరో ప్రాజెక్టు కోయిల్ సాగర్. ఈ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ప్లో 18వేల క్యూసెక్కులు కాగా.. 5గేట్లు ఎత్తి 10,500క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.270టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.008టీఎంసీలకు చేరుకుంది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు..
మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తోంది. ఇన్ ఫ్లో 5.8లక్షల క్యూసెక్కులు కాగా.. ప్రాజెక్టు 30గేట్లు ఎత్తి 5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 18.8139టీఎంసీలకు చేరుకుంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
కడెం ప్రాజెక్టు..
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.31లక్షల క్యూసెక్కులు ఉండగా.. 18గేట్లు ఎత్తి 2.19లక్షల క్యూసెక్కులు దిగువకు విడిచిపెడుతున్నారు. పూర్తి సామర్థ్యం 700అడుగులు కాగా.. ప్రస్తుతం 692.900అడుగులకు చేరుకుంది.
కొమురం భీం ప్రాజెక్టు..
కొమురం భీం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 34,500క్యూసెక్కులుగా ఉండగా.. 5గేట్లు ఎత్తి 43,800క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243మీటర్లు కాగా.. ప్రస్తుతం 237.900మీటర్లకు నీరు చేరింది.
ఈ వార్త కూడా చదవండి:
Rain Effect: పెద్దపల్లిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..