Home » Rajasthan
ఆమె అందమైన యువతి.. రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌లో నివసిస్తుండేది.. ఆమె తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.. కూతురిని బాగా చదివించాలనుకున్నాడు.. జైపూర్‌లో ఉంచి నెల నెలా డబ్బులు పంపిస్తూ చదివించేవాడు.. అయితే ఆ యువతి మాత్రం విలాసాలకు అలవాటు పడింది..
పెళ్లిలో మేనమామ ఇచ్చిన కానుకలు చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. పెళ్లి వేదిక వద్దకు హనుమాన్ రామ్ డబ్బు మూటలతోనూ, బంగారంతోనూ వచ్చాడు. అందరూ చూస్తుండగా పీటల మీద కూర్చున్న వరుడికి అందించాడు. ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆ కుర్రాడి వయసు 5 సంవత్సరాలు.. నాలుగేళ్ల క్రితమే బడిలో చేరాడు.. ప్రతిరోజూ స్కూల్ బస్సులో స్కూల్‌కు వెళ్లి వస్తుండేవాడు.. అయితే ఊహించని ప్రమాదం ఆ కుర్రాడిని చిదిమేసింది.. ఆ కుర్రాడిన రోజూ పాఠశాలకు తీసుకు వెళ్లే బస్సే అతడి ప్రాణాలు తీసింది..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 6 గంటల తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటింగ్‌కు వీలు కల్పించడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల సమయానికి 55.63 శాతంగా నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చురుకుగా జరుగుతోంది. 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి 40.27 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకావడంతో సర్దార్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం సీఎం అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య గొడవలున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గెహ్లాట్ శుక్రవారంనాడు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలంటూ సచిన్ పైలట్ ఓటర్లకు పిలుపినిచ్చిన వీడియోను ఆయన సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను 'పిక్ పాకెట్' తో పోలుస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా ప్రధాని మోదీ...