Heatwave, Heavy rain: ఉత్తరాదిలో అలా.. దక్షిణాదిలో ఇలా..
ABN , Publish Date - May 23 , 2024 | 02:18 PM
ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లోని బామ్మర్‌లో బుధవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
న్యూఢిల్లీ, మే 23: ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లోని బామ్మర్‌లో బుధవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ ఏడాదిలో దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. మే 26వ తేదీ వరకు ఉత్తర భారతదేశంలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది.
నేటి నుంచి మే 26వ తేదీ వరకు రాజస్థాన్‌లోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలతోపాటు పంజాబ్, హర్యానా, యూపీలోని పశ్చిమ ప్రాంతంలో ఈ వేడి గాలుల ఉధృతి ఉంటుందని పేర్కొంది. ఇక ఢిల్లీ, పంజాబ్‌ల్లో శుక్రవారం నుంచి మే 26వ తేదీ వరకు వేడిగాలులు వీస్తాయంది.
LokSabha Elections: మళ్లీ మేమే వస్తాం
ఇక రాజస్థాన్‌లోని బార్మర్, హర్యానాలోని సిర్సా, పంజాబ్‌లోని బటిండా, గుజరాత్‌లోని కాండ్ల, మధ్యప్రదేశ్‌లోని రాట్లం, యూపీలోని ఝాన్సీ, మహారాష్ట్రలోని అకోలాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఈ భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో ఈ రాష్ట్రాల్లో రెడ్ వార్నింగ్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వివరించింది.
మరోవైపు దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చెరీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో సైతం రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే శనివారం వరకు కేరళలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వివరించింది.
Lok Sabha Polls 2024: పీఓకేపై బీజేపీ, టీఎంసీ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం..
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అయిదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు దక్షిణాదిలో వర్షాల కారణంగా నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరువనంతపురం, కొల్లాం, మల్లపురం, కొజికోడ్, వాయనాడ్‌లల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేయగా.. కన్నూరు, కాసర్‌గొడ్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు భారత వాతావరణ శాఖ వివరించింది.
Read Latest National News and Telugu News