Home » Rajnath Singh
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరహద్దుల్లోని తవాంగ్ జిల్లా బమ్ లా పాస్ ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.
భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సాయుధ బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిద దళాలు రక్షణ శాఖ ఆర్థిక వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. C-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సోమవారం భారత వైమానిక దళంలోకి చేరింది. హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త స్కూళ్లు సంబంధిత ఎడ్యుకేషన్ బోర్డుల అఫ్లియేషన్‌తో సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి.
కేంద్ర రక్షణ మంత్రితో నేడు ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం వంటి అంశాలు సైతం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని..
భారత దేశ గౌరవ, ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటి వెళ్లగలమని భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది.
దేశ గౌరవ, మర్యాదలను కాపాడే విషయంలో ఎందాకైనా వెళ్తామని, అవసరమైతే నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను కూడా దాటుతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) పేర్కొన్నారు.
శ గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటడానికైనా వెనుకాడేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ప్రజలు సైనికులకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.