Home » Rajya Sabha
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
రాజ్యసభ ఎన్నికలకు ముందే సమాజ్ వాదీ పార్టీకి సోమవారం రాత్రి గట్టి దెబ్బ తగిలింది. వాస్తవానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. కానీ ఈ విందుకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha elections) మంగళవారంనాడు జరుగనున్నాయి. అదనపు సీటు కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా, ప్రధాన పోటీ మాత్రం బీజేపీ (BJP) సారథ్యంలోని ఎన్డీయే, సమాజ్వాదీ (SP) పార్టీ మధ్య నెలకొంది. మొత్తం 10 సీట్లలో ఎన్నికలు జరుగుతుండగా, 11 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ అనివార్యమైంది.
సమాజ్వాదీ పార్టీకి జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్) పార్టీ షాక్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించింది.
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న కేంద్ర మంత్రి ఎల్.మురుగున్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి పోటీకి దిగారు. రాష్ట్రం నుంచి మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు ఐదుగురే పోటీ చేయడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు గుజరాత్ రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభ రేసులో ఉన్న గోవింద్ ధోలకియా, డాక్టర్ జస్వంత్సిన్హ్ సలామ్సిన్హ్ పార్మార్, మయాంక్ నాయక్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాగాంధీతో పాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు చున్నీలాల్ గారసియా, మదన్ రాథోడ్లు రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరీ మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు.
తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది.
రానున్న లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.