Rajya Sabha: ప్రచారానికి కాదు, పనితీరుకే ప్రజలు ఓటేశారు.. విపక్షాన్ని ఎండగట్టిన మోదీ
ABN , Publish Date - Jul 03 , 2024 | 02:57 PM
తప్పుదారి పట్టించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రచారానికి కాకుండా పనితీరుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగం అంటే తమకు కేవలం నిబంధనల సంగ్రహం కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటించడం తమకు ప్రధానమని చెప్పారు.
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రచారానికి (propaganda) కాకుండా పనితీరు (perfoemance)కు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. రాజ్యాంగం అంటే తమకు (BJP) కేవలం నిబంధనల సంగ్రహం కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటించడం తమకు ప్రధానమని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని బుధవారంనాడు రాజ్యసభ (Rajya Sabha)లో సమాధానమిస్తూ, తాము మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనే నమ్మకంతో ప్రజలు తమను ఎన్నుకున్నారని అన్నారు.
Rajya Sabha Updates: విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్న మోదీ.
పీఎం ప్రసంగంలో హైలైట్స్...
-మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరుతున్నాం.
-మణిపూర్ అంశాన్ని రాజకీయం చేయడం ఆపండి. ఒక రోజు మిమ్మల్ని (కాంగ్రెస్‌ను) మణిపూర్ తిరస్కరించే పరిస్థితి వస్తుంది.
-మణిపూర్ వరదల్లో చిక్కుకుంది, కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకుంటోంది. రెండు ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్‌లను పంపాం.
-మణిపూర్ హింసాకాండంలో 500 మందికి పైగా అరెస్టు చేశాం. 11,000కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యారు. చాలా ప్రాంతాల్లో యథాపూర్వ పరిస్థితి నెలకొంది.
-మణిపూర్‌లో శాంతి నెలకొనేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం. హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయి.
-జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన చివరి దశకు వచ్చింది. ఉగ్రవాదం, వేర్పాటువాదం బలహీనపడింది.
-యువత భవిష్యత్తుతో ఆడుకునే శక్తులను ప్రభుత్వం సహించేది లేదు.
-అవినీతిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛను దర్యాప్తు సంస్థలకు ఇచ్చాం. వారి పనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు.
-యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని పంజరంలో చిలుకగా సుప్రీంకోర్టు అభివర్ణించింది.
-రాజ్యాంగం ప్రతిని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
-రాజ్యాంగాన్ని అతిపెద్ద శత్రువు కాంగ్రెస్సే
నని నేను బలంగా చెప్పగలను.
-రాజ్యాంగం అనే పదం మీకు (కాంగ్రెస్) సరిపడదు.
-రాజ్యాంగాన్ని పరిరక్షించ గలిగేది మేమొక్కరిమేనని నమ్మి ప్రజలు మాకు ఓటేశారు.
-కాంగ్రెస్ ఎప్పుడూ ఓటమి అనివార్యమైన చోట్లలోనే దళిత అభ్యర్థులను పోటీలోకి దింపుతుంది.
-ఎన్నికల ఫలితాలతో దేశవాళీ క్యాపిటల్ మార్కెట్లు బలపడటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి.
-140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు జీర్ణం చేసుకోలేకపోతున్నాయి.
-ప్రభుత్వం చేసే ప్రతి పనికి ప్రజలకు లెక్క చెప్పడం మా ప్రభుత్వ బాధ్యత.
-యూపీఏ హయాంలో రుణాల రద్దుతో కేవలం 3 కోట్ల మంది రైతులే ప్రయోజనం పొందారు. కానీ ఎన్డీయే పీఎం-కిసాన్ పథకంతో 10 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు.
-అబద్ధాలు ప్రచారం చేసే వారికి సత్యం వినే ధైర్యం లేదనే విషయాన్ని యావద్దేశం గమనిస్తోంది.
-విపక్షాలు ఓటమిని చవిచూసాయి, ఇప్పుడు నినాదాలతో పారిపోతున్నారు (విపక్షాల బాయ్‌కాట్‌పై).
-దేశంలోని ప్రజా రవాణా, టెక్నాలజీలో శీఘ్రగతిని మార్పులు తెచ్చాం.
-భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే సమయానికి దేశీయంగానే కాకుండా, గ్లోబల్ స్థాయిలో అనేక సానుకూల పరిణామాలు వస్తాయి.
-రాబోయే ఐదేళ్లలో పేదరికానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం సాగిస్తాం.
-రాజ్యాంగం ఒక లైట్‌హౌస్ తరహాలో మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
-ప్రజలు విపక్షాల ఎజెండాను తిప్పికొట్టారు. గత పదేళ్లలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన పనులకు బాసటగా నిలిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..