Share News

Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:54 PM

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కొందరు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలను విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం తరపున ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు.

Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..
PM Modi

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కొందరు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలను విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం తరపున ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తోందన్నారు. దశాబ్దాల తర్వాత దేశంలోని ప్రజలు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశాన్ని తమ ప్రభుత్వానికి కల్పించారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధారణమని.. అయినప్పటికీ ప్రజల తీర్పును కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఓడిపోయిన వ్యక్తులు తాము గెలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మరోవైపు మోదీ ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపటికి ప్రధాని ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు


గత 10 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తున్నామని.. తమ నిరంతర సేవకు, పనికి ప్రజలు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చారని ప్రధాని మోదీ రాజ్యసభలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్నికి దేశ ప్రజలు ఆశీస్సులు అందించారన్నారు. దేశం యొక్క మేధస్సు గురించి ప్రతి ఒక్కరు గర్వపడతారని తెలిపారు. అసత్య ప్రచారాన్ని ప్రజలు ఓడించారని తెలిపారు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని.. ఆ రాజ్యాంగాన్ని అవమానించిన వాళ్లే ఇవాళ రాజ్యాంగాన్ని ఊపుతూ తాము పరిరక్షకులమని చెప్పుకుంటున్నారన్నారు. రాజ్యాంగం వల్లే తాను ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చిందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ఎంతో విలువైనదన్నారు. రాజ్యాంగం మనకు మార్గదర్శకంగా పనిచేస్తుందని మోదీ తెలిపారు. రాజ్యాంగం దీపస్తంభంలా పనిచేస్తుందని చెప్పారు. నవంబరు 24న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినప్పుడు ఇక్కడ రాజ్యాంగాన్ని ఊపేస్తున్న కొందరు వ్యతిరేకించారని అన్నారు.

PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!


కాంగ్రెస్‌పై విమర్శలు..

రిమోట్ ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు అలవాటని విమర్శించారు. కాంగ్రెస్ ఆటో మోడ్ ప్రభుత్వాన్ని కోరుకుంటోందని.. ప్రజాప్రభుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలోనే అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు.


రైతుల సంక్షేమంపై..

రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, పంటలకు కనీస మద్దతు ధర అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.


Hathras: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం.. నేడు సీఎం కూడా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 03 , 2024 | 01:05 PM