Upendra Yadav: కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:42 PM
Delhi vs Railways: రంజీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఆరాను అంతా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్‌లో అతడి ప్రతి కదలికను అందరూ ఆస్వాదిస్తున్నారు. మ్యాచ్ ఆడుతోంది 22 మంది ఆటగాళ్లైనా.. అభిమానులతో పాటు కెమెరా కళ్లన్నీ కింగ్ మీదే ఫోకస్ చేశాయి.

రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రతి మూమెంట్‌ను ఆస్వాదిస్తున్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టులోని ఆటగాళ్లందరితో అతడు ఈజీగా కలసిపోయాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో చనువుగా ఉన్నాడు. ఫీల్డింగ్ పొజిషన్స్, బౌలింగ్ చేంజెస్, గేమ్ అవేర్‌నెస్‌తో పాటు వ్యూహాల మార్పులపై ఎప్పటికప్పుడు కెప్టెన్‌తో డిస్కస్ చేస్తూ కనిపించాడు. ఇలా అతడు గ్రౌండ్‌లో జోష్‌గా ఉండటంతో స్టేడియంలోని వేలాది మంది కూడా ఆద్యంతం ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దిగ్గజ ఆటగాడి ప్రతి కదలికను ఆస్వాదించారు. అయితే ఓ ఆటగాడు మాత్రం కోహ్లీని భయపెట్టాడు. అతడు ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
నిలబడి.. కలబడి!
13 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన కోహ్లీని చూసేందుకు వేలాది మంది అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియానికి తరలివచ్చారు. అతడి ఆరాను సొంత జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి రైల్వేస్ క్రికెటర్లూ ఎంజాయ్ చేశారు. అయితే ఓ బ్యాటర్ మాత్రం గేమ్ మీదే ఫోకస్ చేశాడు. కోహ్లీ టీమ్‌కు అడ్డుగా నిలిచాడు. అతడే ఉపేంద్ర యాదవ్. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది రైల్వేస్. అయితే 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన ఉపేంద్ర.. 177 బంతుల్లో 95 పరుగుల బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 10 బౌండరీలు బాదిన ఉపేంద్ర.. 1 సిక్స్ కొట్టాడు.
కర్ణ్‌తో కలసి..
వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు వెళ్లడంతో ఉపేంద్ర యాదవ్ క్రీజులో నిలదొక్కుకోవడం మీదే ఫోకస్ పెట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న కర్ణ్ శర్మ (105 బంతుల్లో 50)తో కలసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇద్దరూ ఒక్కసారి కుదురుకున్నాక అటాకింగ్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఉపేంద్ర ఉతుకుడు మొదలుపెట్టాడు. నవ్‌దీప్ సైనీతో పాటు మోనీ గేర్వాల్, శివమ్ శర్మను టార్గెట్ చేసుకొని భారీ షాట్లు కొట్టాడు. కర్ణ్ కూడా బ్యాట్ ఊపడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత తక్కువ సమయంలో వీళ్లిద్దరూ ఔట్ అవడంతో రైల్వేస్ ఇన్నింగ్స్ 241 వద్ద ఆగిపోయింది. ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కు ఇన్‌స్పిరేషన్ అయిన కోహ్లీని చూస్తూనే అతడి సొంత గ్రౌండ్‌లో భారీ షాట్లతో చెలరేగాడు ఉపేంద్ర. క్లాసిక్ బ్యాటింగ్‌తో విరాట్‌ను కూడా ఇంప్రెస్ చేశాడు.
ఇదీ చదవండి:
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
కోహ్లీ పైకి దూసుకొచ్చిన అభిమాని.. గల్లా పట్టి..
జనమా.. బంతిపూల వనమా.. కోహ్లీ క్రేజ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి