Share News

Virat Kohli: ఎగిరిపడిన ఆఫ్ స్టంప్.. కోహ్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:34 PM

Delhi vs Railways: విరాట్ కోహ్లీ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. అన్ని ప్రశ్నలు, సందేహాలు, విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పాలనుకుంటే.. ఈసారి కూడా అతడిపై బంతి ఆధిపత్యం సాధించింది.

Virat Kohli: ఎగిరిపడిన ఆఫ్ స్టంప్.. కోహ్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి
Virat Kohli

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒకటి అనుకుంటే మరొకటి అయింది. అతడు రంజీ ట్రోఫీలో ఆడి ఏదైతే సాధించాలని అనుకున్నాడో దానికి ఆదిలోనే గండి పడింది. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస వైఫల్యాలతో విమర్శలపాలవుతున్న కింగ్.. ఫామ్‌లోకి వచ్చేందుకు రంజీల బాట పట్టాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్‌ను ఎదుర్కోవడంలో ఉన్న ఇబ్బందుల్ని సరిజేసుకోవాలని భావించాడు. కానీ తొలి పరీక్షలోనే అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఓ బచ్చా బౌలర్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు స్టార్ బ్యాటర్. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


అట్టర్ ఫ్లాప్!

రైల్వేస్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి టచ్‌లోకి వద్దామని కోహ్లీ అనుకున్నాడు. అందుకు తగ్గట్లే టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ శిక్షణలో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్‌తో పాటు షార్ట్ పిచ్ బంతులను ప్రాక్టీస్ చేశాడు. కానీ ఏం లాభం? తీరా యాక్షన్‌లోకి వచ్చేసరికి అంతా రివర్స్ అయింది. ఇవాళ ఢిల్లీ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ 14 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆరంభంలోనే ఒక బౌండరీ కొట్టి మంచి ఊపులో కనిపించిన విరాట్.. హిమాన్షు సాంగ్వాన్ అనే అనామక బౌలర్ వేసిన ఇన్‌స్వింగర్‌కు వికెట్ పారేసుకున్నాడు. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతి పిచ్ అయ్యాక లోపలకు దూసుకొచ్చింది. కోహ్లీ బ్యాట్‌ను దాటి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.


కొత్త బలహీనత!

నిన్న మొన్నటి వరకు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్‌కే కోహ్లీ ఔట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్‌స్వింగర్ బలహీనత బయటపడింది. దీంతో వచ్చే ఇంగ్లండ్ సిరీస్, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆ తర్వాత జరిగే ఇంగ్లండ్ టూర్‌లోనూ ఈ తరహా బంతులతో స్టార్ బ్యాటర్‌ను అపోజిషన్ టీమ్స్ టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ రిథమ్ కోల్పోయాడని.. అతడు బాల్ లైన్‌లోకి వెళ్లలేకపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షాట్లు కొట్టాలనే తొందరలో బంతి గతి, స్వింగ్, దిశను అంచనా వేయడం, అందుకు తగ్గ షాట్ సెలెక్షన్ కనిపించడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. టైమింగ్ ఆలస్యం అవడం కూడా అతడి కొంపముంచుతోందని అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా అతడు సత్తా చాటుతాడేమో చూడాలి.


ఇవీ చదవండి:

‘అమ్మాయిల ఫుట్‌బాల్‌.. సంప్రదాయాలకు వ్యతిరేకం’

రాణించిన తన్మయ్‌

పుణెలోనే పూర్తి చేస్తారా?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 01:37 PM