Share News

Ranji Trophy 2025: ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:15 PM

Cheteshwar Pujara-Ajinkya Rahane: ఒకే రోజు ముగ్గురు స్టార్లు సెంచరీలు మిస్ చేసుకున్నారు. అందరూ 90ల్లోనే వికెట్ పారేసుకున్నారు. దీంతో అప్పటిదాకా పడిన కష్టమంతా వృథా అయింది.

Ranji Trophy 2025: ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
Ranji Trophy

క్రికెట్‌లో టీ20లు, వన్డేల కంటే కూడా టెస్టుల్లో సెంచరీలు కొట్టడం చాలా కష్టం. సుదీర్ఘ ఫార్మాట్‌లో సెషన్ సెషన్‌కూ ఆట మారిపోతూ ఉంటుంది. పిచ్ ప్రవర్తించే తీరు, కండీషన్స్ చేంజ్ అవుతాయి. పేసర్లు, స్పిన్నర్లు విసిరే చాలెంజ్‌కు నిలబడాలి. క్రీజులో పాతుకుపోతే గానీ పరుగులు రావు. ఒక్కో పరుగు చేస్తూ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాలి. కాస్త ఓపిక తగ్గినా వికెట్ పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే లాంగ్ ఫార్మాట్‌లో సెంచరీలను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే ముగ్గురు స్టార్ క్రికెటర్లు ఒకే రోజు ఈ మార్క్‌ను అందుకోలేక అభిమానుల్ని నిరాశపర్చారు. వాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..


అందుకోలేకపోయారు!

టీమిండియా సీనియర్లు అజింక్యా రహానె, ఛతేశ్వర్ పుజారా మైల్‌స్టోన్స్ మిస్ అయ్యారు. భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన ఈ వెటరన్ బ్యాటర్లు.. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్నారు. రంజీ ట్రోఫీలో వీళ్లిద్దరూ దుమ్మురేపుతున్నారు. అయితే ఇద్దరూ ఒకే రోజు సెంచరీ ముందు ఆగిపోయారు. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో పుజారా (167 బంతుల్లో 99 పరుగులు) అదరగొట్టాడు. 10 బౌండరీలు బాదిన నయా వాల్.. ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. తనదైన శైలిలో సాలిడ్ డిఫెన్స్ చేస్తూనే, వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు కొట్టాడు. అయితే సరిగ్గా సెంచరీకి ముందు ముక్తార్ హుస్సేన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అటు రహానేది కూడా ఇదే పరిస్థితి.


1 పరుగు దూరంలో..

మేఘాలయతో మ్యాచ్‌లో రహానె (177 బంతుల్లో 96) అదుర్స్ అనిపించాడు. 11 బౌండరీలు కొట్టిన వెటరన్ బ్యాటర్.. 1 సిక్స్ బాదాడు. కెప్టెన్సీతో నాక్‌తో టీమ్ భారీ స్కోరు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సెంచరీ మార్క్ అందుకోవడం పక్కా అనే తరుణంలో 4 పరుగుల దూరంలో ఆగిపోయాడు. నఫీస్ సిద్దిఖీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఐపీఎల్ స్టార్, ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని (77 బంతుల్లో 99) కూడా సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ లాంటి టాప్ స్టార్ ఫెయిలైన చోటు బదోని ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. 12 బౌండరీలు, 3 సిక్సులతో ఊచకోత కోశాడు. అయితే శతకానికి 1 పరుగు దూరంలో కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇలా ముగ్గురు భారత స్టార్లు ఒకే రోజు సెంచరీలు మిస్ చేసుకొని అభిమానుల్ని నిరాశపర్చారు.


ఇవీ చదవండి:

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం

కోహ్లీని ఔట్ చేసిన టికెట్ కలెక్టర్.. ఎవరీ హిమాన్షు సాంగ్వాన్

గిరిపడిన ఆఫ్ స్టంప్.. కోహ్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 04:25 PM