Home » Ravichandran Ashwin
సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా నాలుగో విజయంపై కన్నేసింది. ఈ క్రమంలోనే గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పసికూన అఫ్ఘనిస్థాన్‌తో నేడు టీమిండియా తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
టీమిండియా ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం నుంచి స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో టీమిండియా అతడిని పక్కకు తప్పించింది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
మరో 15 రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకన్న ముందు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
టీమిండియాలో గత కొంతకాలంగా శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ లాంటి ఆటగాళ్లను సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లలో రాణిస్తున్నా వీళ్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదు. దీంతో వెటరన్ క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లేనా అని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలు సృష్టించడం ఆపండంటూ మండిపడ్డారు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడి విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా యువ జట్టుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమర్శకులకు అశ్విన్ సమాధానమిచ్చాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో (West Indies vs India 2nd Test) టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత(Team india) బౌలర్‌గా నిలిచాడు.
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో కొనసాగుతున్నాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల (India won by an innings and 141 runs) భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఆసియా వెలుపల టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం.