Share News

IND vs AUS: బుద్ధి చూపించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ రిపీట్

ABN , Publish Date - Dec 07 , 2024 | 01:10 PM

IND vs AUS: ఆస్ట్రేలియా జట్టు మరోమారు బుద్ధి చూపించింది. గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే కంగారూలు.. భారత్‌ను ఓడించడానికి వేస్తున్న ఎత్తులు చూసి అభిమానులు సీరియస్ అవుతున్నారు.

IND vs AUS: బుద్ధి చూపించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ రిపీట్

BGT 2024: బరిలోకి దిగిన ప్రతి జట్టు గెలవాలనే అనుకుంటుంది. విజయం సాధించి తమ అభిమానులను సంతోషంలో ముంచెత్తాలని చూస్తుంది. దేశ కీర్తిప్రతిష్టలను పెంచాలని భావిస్తుంది. అయితే ఎప్పుడూ తమదే పైచేయి ఉండాలి అనుకొనే కొన్ని టీమ్స్ విజయం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. గెలుపు దాహం తగ్గని ఆ జట్లు తామే ఛాంపియన్స్‌గా ఉండాలని అనుకుంటాయి. కింద పడినా తమదే పైచేయి అనే అహంభావం కలిగిన అలాంటి కొన్ని టీమ్స్‌లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. విన్నింగ్ ముఖ్యంగా భావించే కంగారూలు.. గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తారు. అయితే ఓడే ప్రమాదం ఉంటే స్లెడ్జింగ్ దగ్గర నుంచి చాలా అస్త్రాలను ప్రత్యర్థులపై ప్రయోగిస్తారు. ఈసారి చీటింగ్ ఆయుధాన్ని బయటకు తీసి విమర్శలపాలవుతున్నారు.


కొంపముంచిన అంపైర్లు

ఆస్ట్రేలియా మరోమారు బుద్ధి చూపించింది. గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే కంగారూలు.. భారత్‌ను ఓడించడానికి వేస్తున్న ఎత్తులు చూసి అభిమానులు సీరియస్ అవుతున్నారు. అడిలైడ్ టెస్ట్‌లో అంపైర్లు వ్యవహరిస్తున్న తీరుపై అంతా ఫైర్ అవుతున్నారు. భారత బ్యాటింగ్ సమయంలో కేఎల్ రాహుల్ నాటౌట్ అయినా ఔట్ ఇచ్చారు. అదే ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ ఔట్ అయినా అంపైర్లు ఇవ్వలేదు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు మార్ష్. అశ్విన్ వేసిన బంతిని డిఫెన్స్ చేయబోయి మిస్ అయ్యాడు. బాల్ అతడి బ్యాట్‌ను దాటుకొని వెళ్లి ప్యాడ్స్‌కు తగిలింది. అయితే భారత ఆటగాళ్లు అప్పీల్ చేసినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రివ్యూ తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.


క్లియర్ ఔట్ కనిపిస్తున్నా..

డీఆర్ఎస్ తీసుకున్నా నిర్ణయం టీమిండియాకు వ్యతిరేకంగా వచ్చింది. బంతి మొదట ప్యాడ్స్‌కు, ఆ తర్వాత బ్యాట్‌కు తగిలినట్లు క్లియర్‌గా కనిపించింది. అయినా కన్‌క్లూజివ్ ఎవిడెన్స్ లేదనే కారణం చూపి ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతో గ్రౌండ్‌లోని భారత ఆటగాళ్లతో పాటు స్టేడియంలో తిలకిస్తున్న వారు, టీవీలు-ఫోన్లలో లైవ్ చూస్తున్న కోట్లాది మంది టీమిండియా అభిమానులు షాక్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో వరుసగా అంపైరింగ్ నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా వస్తుండటంతో ఆసీస్ చీటింగ్ చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పెర్త్ టెస్ట్‌లో ఘోర ఓటమి ఎదురవడంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే కంగారూలు మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఛీ.. ఎంతకు దిగజారారు అని ఫైర్ అవుతున్నారు.


Also Read:

ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సుమిత్‌

పారా క్రీడల్లో తెలుగోళ్లకు 7 పతకాలు

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 01:16 PM