Share News

Ravichandran Ashwin: అశ్విన్‌పై కుట్ర.. పక్కా ప్లానింగ్‌తో సైడ్ చేసేశారు

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:27 PM

Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Ravichandran Ashwin: అశ్విన్‌పై కుట్ర.. పక్కా ప్లానింగ్‌తో సైడ్ చేసేశారు
Ravichandran Ashwin

IND vs AUS: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. జెంటిల్మన్ గేమ్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. టీమిండియాకు ఇన్నేళ్లు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందన్నాడు. క్రికెట్‌ను వీడాల్సిన టైమ్ వచ్చేసిందన్నాడు. అయితే అశ్విన్ నిష్క్రమణ వెనుక కుట్ర ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


వాళ్లను వదిలేసి..

భారత జట్టులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్స్‌లో అశ్విన్ ఒకడు. దశాబ్ద కాలంగా టీమ్ బౌలింగ్ విభాగానికి అతడు వెన్నెముకగా ఉన్నాడు. బ్యాటింగ్‌లోనూ అతడి కాంట్రిబ్యూషన్ ఎక్కువే. ఈ మధ్య కాలంలోనూ వికెట్ల మీద వికెట్లు తీస్తూ, బ్యాట్‌తోనూ రాణిస్తూ కన్‌సిస్టెన్సీ చూపిస్తున్నాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్‌లో ఒక టెస్ట్, ఆసీస్‌తో ప్రస్తుత సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో అతడు ఫెయిల్ అయ్యాడు. రెండు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన అతడు రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


వాళ్ల పన్నాగమేనా?

విరాట్ కోహ్లీ గత మూడ్నాలుగేళ్లుగా టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మ బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి శానా కాలమైంది. అయినా వీళ్లను కాకుండా అశ్విన్‌ను టీమ్‌కు దూరం చేయడం పక్కా ప్లానింగ్‌తో జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. టీమ్ ఫెయిల్యూర్‌కు అశ్విన్‌ను ఒక్కడ్నే బలి చేశారని కామెంట్స్ చేస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ పెద్దలు కలసి పన్నిన పన్నాగం ఇది అని ఆరోపిస్తున్నారు. అశ్విన్‌ను సాఫ్ట్ టార్గెట్‌ చేసి.. టీమ్ నుంచి సైడ్ చేశారని ఫైర్ అవుతున్నారు.

Updated Date - Dec 18 , 2024 | 01:27 PM