Home » Reservations
షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల అడ్మిషన్లు 2014 నుంచి 2022వ సంవత్సరం నాటికి 44 శాతం పెరిగాయని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్సీబీసీ) వెల్లడించింది. అదే సమయంలో దళిత బాలికల అడ్మిషన్లు 51 శాతం..,..
Andhrapradesh: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. ప్రతిపక్షం ఒక అంశం తెరపైకి తీసుకొస్తే.. దానికి ధీటుగా అధికార పక్షం మరొక అంశాన్ని లేవనెత్తుతోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అజెండా పక్కకు వెళ్లిపోయింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. గతంలో ఏం చేశామనే ముచ్చట్లే లేవు. ఎన్నికల ప్రచారం మొత్తం రెండే రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాను స్వాగతిస్తానని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే, రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఉండకూడదన్నారు. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్‌గానీ, ఇండియా కూటమిగానీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను మహిళల మెడలో మంగళసూత్రాలతో సహా లాక్కొని ముస్లింలకు పంచుతారని, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి వాటిని ముస్లింలకు ఇస్తారని ప్రధాని మోదీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముస్లింలకు ఎంతమాత్రం రిజర్వేషన్లు ఇవ్వటానికి వీల్లేదని, తాను బతికుండగా ఆ పనికి అవకాశం ఇవ్వబోనని తేల్చి చెబుతున్నారు.
ఓవైపు దేశ రాజకీయాల్లో ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్ల’ అంశంపై వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సంచలన ప్రకటన చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని..
ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal) తెలిపారు. ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ (YSRCP) ఎంపీ ఆర్ క్రిష్టయ్య కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్లు తీసేయడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ అని చెప్పారు.
మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
రిజర్వేషన్లపై(Reservations) అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు.