Home » Rohit Sharma
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది? ప్లేయింగ్ XIలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కన్ఫమ్ అయ్యాడు కానీ, ఇతర ఆటగాళ్లే విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు.
ఈమధ్య కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా రావడం.. క్రీడాభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించారు. నిన్నటి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ.. కనీసం బ్యాట్ పైకి లేపలేదని గుర్తుచేశారు. తన వ్యక్తిగత రికార్డుల కన్నా.. జట్టు ప్రయోజనాలు ముఖ్యమని భావించారని లీ పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో వచ్చినప్పటి నుంచే హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అతనికి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇక కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో విఫలమవుతుండటంతో.. ఆ విమర్శలు మరింత పెరిగాయి.
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో 29వ మ్యాచ్ నిన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ముంబై ఓడినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం 105 పరుగులు చేసి అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024(ipl 2024)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) జట్లు ఆదివారం రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ముంబై(mumbai)లోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మకు కాకుండా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అప్పగించడంపై చర్చ సాగుతూనే ఉంది. రోహితే కెప్టెన్‌గా ఉండాలంటూ ముంబై అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ప్రత్యక్షంగా, సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించినప్పటి నుంచి అతడి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఢిల్లీ బౌలర్లను ఊతికారేస్తూ బ్యాటింగ్ పిచ్‌పై పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్(39) విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల దుమ్ములేపారు.