Share News

IND vs ENG: ఇంగ్లండ్‌ను వణికించిన భారత్.. ఫీల్డింగ్‌తోనే పోయించారు

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:37 PM

Yashasvi Jaiswal: ఫీల్డింగ్‌తో మ్యాచులు గెలవొచ్చని ఎన్నో మార్లు ప్రూవ్ అయింది. అందుకే క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ లాంటి నానుడి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

IND vs ENG: ఇంగ్లండ్‌ను వణికించిన భారత్.. ఫీల్డింగ్‌తోనే పోయించారు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తన ఫీల్డింగ్ పవర్ ఏంటో చూపించింది. కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా నుంచి సీనియర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వరకు అంతా ఫీల్డింగ్‌లో దుమ్మురేపారు. ఒకదశలో 8.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 75 పరుగులతో బలంగా కనిపించింది ఇంగ్లండ్. ఆ తర్వాత 2 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది బట్లర్ సేన. దీనికి బౌలర్ల కంటే ఫీల్డర్లకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా జైస్వాల్, అయ్యర్ పెట్టిన ఎఫర్ట్‌ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే.


కపిల్‌దేవ్‌ను గుర్తుచేశాడు!

హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ లెగ్ సైడ్ షాట్ కొట్టాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ అవకపోవడంతో గాల్లోకి లేచింది బంతి. అయితే బౌండరీకి ఇవతల ఉన్న బంతిని సర్కిల్‌లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేసి అందుకున్నాడు జైస్వాల్. లెజెండ్ కపిల్ దేవ్ మాదిరిగా బ్యాక్ రన్నింగ్ చేసి అసాధ్యమైన క్యాచ్ పట్టాడు. వెనక్కి పరిగెడుతున్నా బంతి మీద దృష్టి మరల్చలేదు. ఆఖరి వరకు దానిపై ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత అమాంతం పక్షిలా డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. కింద పడినా బాల్‌ను మాత్రం వదల్లేదు. మరోవైపు 26 బంతుల్లో 43 పరుగులతో ఊపు మీదున్న సాల్ట్‌ను రనౌట్ చేశాడు అయ్యర్. మూడో రన్ కోసం ప్రయత్నిస్తుండగా బౌండరీ నుంచి బాల్‌ను పట్టుకొని నేరుగా కీపర్‌కు విసిరాడు అయ్యర్. బంతిని అందుకున్న వెంటనే వికెట్లు గిరాటేశాడు రాహుల్. అలా వెంటవెంటనే టాపార్డర్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ప్రెజర్‌లోకి నెట్టారు భారత ఫీల్డర్లు.


ఇవీ చదవండి:

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు మరో షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

తెలుగోళ్ల ప్రేమకు కేన్ మామ ఫిదా.. ఆ పేరు అదిరిపోయిందంటూ..

కివీస్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవం.. ఈ ఇన్నింగ్స్‌ గుర్తుందా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 04:57 PM