Rohit Sharma Records: ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌మ్యాన్ తాండవం
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:01 AM
India vs England: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత రికార్డులకు పాతర వేశాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో 5 క్రేజీ రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆకలి గొన్న పులి వేటాడితే ఎట్లా ఉంటుందో భారత సారథి రోహిత్ శర్మ చూపించాడు. చాన్నాళ్లుగా పరుగుల దాహంతో ఉన్న హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్ మీద ఉరుములా పడ్డాడు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, గస్ అట్కిన్సన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్‌ను అతడు ఊచకోత కోశాడు. బౌండరీలు, సిక్సులతో హోరెత్తించాడు. బట్లర్ సేనతో జరిగిన రెండో వన్డేలో 76 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు రోహిత్. మొత్తంగా 90 బంతుల్లో 119 పరుగులతో వార్ వన్ సైడ్ చేసేశాడు. ఫోర్లు, సిక్సుల ద్వారానే అతడు 90 పరుగులు చేశాడంటేనే ఏ రేంజ్‌లో చెలరేగి ఆడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి మ్యాచ్‌తో 5 క్రేజీ రికార్డుల్ని బ్రేక్ చేశాడతను. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అత్యధిక శతకాలు
30 ఏళ్లు దాటిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత ఆటగాడిగా రోహిత్ (36 సెంచరీలు) నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (35 శతకాలు)ను హిట్‌మ్యాన్ అధిగమించాడు. అంతర్జాతీయంగా చూసుకుంటే రికీ పాంటింగ్ (36 సెంచరీలు)తో కలసి మూడో స్థానంలో నిలిచాడు.
అత్యధిక అర్ధశతకాలు
సచిన్ పేరు మీద ఉన్న మరో రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ బాదిన టీమిండియా బ్యాటర్‌గా సచిన్ (120 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు)ను దాటేశాడు హిట్‌మ్యాన్ (121).
అత్యధిక పరుగులు
భారత జట్టు తరఫున ఓపెనర్‌గా దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,335 పరుగులు)ను దాటేసి సెకండ్ పొజిషన్‌కు చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ (15,758)ని అధిగమించాలని చూస్తున్నాడు.
అత్యధిక సిక్సులు
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సులు బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్ (259 ఇన్నింగ్స్‌ల్లో 332 సిక్సులు) నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (331 సిక్సులు)ను అతడు దాటేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ (351 సిక్సులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇవీ చదవండి:
చరిత్ర సృష్టించిన రోహిత్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు
అంతుపట్టని సమస్యకు పిండం పెట్టిన రోహిత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి