Share News

KL Rahul: ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌‌పై పగబట్టారా..

ABN , Publish Date - Feb 10 , 2025 | 02:38 PM

IND vs ENG: టీమిండియా విజయాల బాటలో పరుగులు పెడుతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు 2-0తో వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక ఆటగాడితో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.

KL Rahul: ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌‌పై పగబట్టారా..
KL Rahul

టీమిండియా ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉంది. ఇటీవల కాలంలో టెస్టుల్లో తడబడుతూ వచ్చిన భారత్.. తనకు అచ్చొచ్చిన వన్డేలు, టీ20ల్లో మాత్రం అదరగొడుతోంది. రీసెంట్‌గా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు జరుగుతున్న వన్డే సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. మరో వన్డే ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. సారథి రోహిత్ శర్మ (90 బంతుల్లో 119) సెంచరీతో చెలరేగడం, మిగతా బ్యాటర్లు ఫామ్‌ అందుకోవడం, బౌలర్లు అదరగొడుతుండటం భారత్‌కు బిగ్ ప్లస్‌గా మారాయి. కానీ ఒక్కడికి మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడే స్టైలిష్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్.


కాన్ఫిడెన్స్ మీదే కొడుతున్నారు!

కేఎల్ రాహుల్ వన్డే స్పెషలిస్ట్‌గా ముద్రపడిన ప్లేయర్. వికెట్ల వెనుక చురుగ్గా క్యాచులు అందుకోవడం, రనౌట్లు, స్టంపింగ్స్ చేయడంతో పాటు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే స్ట్రాంగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లుగా నంబర్ 5 పొజిషన్‌లో ఆడుతూ దుమ్మురేపాడు. గత 30 ఇన్నింగ్స్‌ల్లో 57 యావరేజ్‌తో 1,259 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫిఫ్త్ డౌన్‌లో ఇంత తోపు రికార్డు ఉన్న రాహుల్‌‌తో భారత టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. ఇంగ్లండ్‌తో గత రెండు వన్డేల్లో రాహుల్‌ను లోయరార్డర్‌లో ఆడిస్తున్నారు. 6 లేదా 7 డౌన్‌లో దింపుతుండటంతో అతడి కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది. ఇది రాహుల్ బాడీ లాంగ్వేజ్‌లో కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ఎందుకు మారుస్తున్నారు?

గత రెండు వన్డేల్లో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ సహా బ్యాటర్లంతా తమ పొజిషన్లలో ఆడారు. కానీ ఒక్క రాహుల్‌ను మాత్రం కింద ఆడిస్తున్నారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలనే ఆలోచనతో కేఎల్ స్థానంలో అక్షర్ పటేల్‌ను దింపుతున్నారు. అయితే తొలి మ్యాచ్‌లో అక్షర్ రాణించాడు. అయినా రెండో మ్యాచ్‌లోనూ అతడ్ని మళ్లీ ఫిఫ్త్ డౌన్‌లోనే ఆడించారు. మరో 9 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ లాంటి బిగ్ టోర్నమెంట్ జరగనుంది. ఆ టోర్నీకి ముందు జరిగే ఏకైక సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో ప్రతి ఆటగాడికి తగినంత ప్రాక్టీస్ దొరికేలా ప్లాన్ చేయాలి. కానీ రాహుల్‌ విషయంలో అలా చేయడం లేదు.


ఎందుకా రూల్?

రెగ్యులర్ ప్లేస్‌ అయిన 5వ డౌన్‌లో కాకుండా రాహుల్‌ను దిగువన ఆడిస్తున్నారు. ఆఖర్లో ఆడే అవకాశం వస్తున్నా అతడు విఫలమవుతున్నాడు. దీంతో అతడిపై పగబట్టారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్, కోహ్లీ, గిల్, హార్దిక్, అయ్యర్.. ఇలా మిగతా బ్యాటర్లకు లెఫ్ట్-రైట్ కాంబినేషన్ చూడకపోవడం, రాహుల్ ఒక్కడి విషయంలో ఆ రూల్‌ను పాటించడంతో లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రాహుల్‌ను ఫిఫ్త్ డౌన్‌లో ఆడించకూడదు, అతడు ఆ ప్లేస్‌కు పనికిరాడని భావిస్తే రిషబ్ పంత్‌ను టీమ్‌లోకి తీసుకోవాలి గానీ ఇలా అవమానించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సిరీస్‌లో గనుక అతడు పరుగులు చేసి రిథమ్‌లోకి రాకపోతే చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయంలో పరుగులు చేయాలంటే కష్టమని.. అతడి విషయంలో లెఫ్ట్-రైట్ కాంబో ఉండాలనే ఆలోచనను గంభీర్-రోహిత్ మానుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌‌మ్యాన్ తాండవం

చరిత్ర సృష్టించిన రోహిత్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు

అంతుపట్టని సమస్యకు పిండం పెట్టిన రోహిత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 10 , 2025 | 02:38 PM