Home » Rohit Sharma
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ఇప్పటివరకు ఏది కలిసిరాలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకురావడం బెడిసికొచ్చింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఆశించిన మేర సత్తా చాటలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ద్వేషిస్తున్నంతగా మరెవరిని ద్వేషించకపోవచ్చు. సోషల్ మీడియాలో, బయట హార్దిక్ పాండ్యాపై అనేక మంది క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు 250వది.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
క్రికెట్లో ఏదైనా ఒక జట్టు ఓటమి పాలైనప్పుడు.. దాని పరిణామాలపై ఆయా జట్టు కోచ్‌లు కెప్టెన్‌తో చర్చలు జరపడాన్ని మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయ్యాక అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబాని కాసేపు చర్చించుకున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ బుధవారం ఆడే మ్యాచ్ ద్వారా ఆ జట్టు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును సమం చేయనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బుధవారం తలపడనున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబై ఇండియన్స్ బుధవారం తలపడనుంది.
ఈ ఏడాది చివరలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనున్నాయి. 1992 తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడడం ఇదే తొలిసారి.
ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ శాపం తగలనుందా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పట్టిన గతే ముంబై ఇండియన్స్‌కు కూడా పట్టనుందా.. అంటే అవుననే అంటున్నారు అభిమానులు. దీనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉదంతాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.