Share News

IND vs ENG: బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి స్పిన్ మాంత్రికుడు.. రోహిత్ గట్టి ప్లానే వేశాడు

ABN , Publish Date - Feb 05 , 2025 | 09:16 AM

Team India: భారత క్రికెట్ జట్టు మరో బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. టీ20 సిరీస్‌లో తలబడిన ఇంగ్లండ్‌తోనే వన్డే ఫైట్ కూడా చేయనుంది టీమిండియా. అయితే సరిగ్గా మొదటి మ్యాచ్‌కు ముందు జట్టులోకి ఓ స్పిన్ మాంత్రికుడ్ని తీసుకుంది.

IND vs ENG: బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి స్పిన్ మాంత్రికుడు.. రోహిత్ గట్టి ప్లానే వేశాడు
IND vs ENG

చాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది టీమిండియా. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతోంది రోహిత్ సేన. మూడు వన్డేల ఈ సిరీస్ ఫిబ్రవరి 6వ తేదీన షురూ కానుంది. ఇప్పటికే ఇరు జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. టీ20 సిరీస్ ఎలాగూ పోయింది.. కనీసం వన్డేల్లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని ఇంగ్లీష్ టీమ్ భావిస్తోంది. అదే భారత్ ఈ సిరీస్‌ను కూడా పట్టేయాలని చూస్తోంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు మరింత కాన్ఫిడెన్స్ నింపుకోవాలని అనుకుంటోంది. గెలిచి తీరాలని చూస్తున్న రోహిత్ సేన.. అందుకోసం ఓ స్పిన్ మాంత్రికుడ్ని దింపుతోంది. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..


ప్రాక్టీస్ ఫొటోలు వైరల్!

టీ20 సిరీస్‌లో రచ్చ లేపిన వరుణ్ చక్రవర్తిని వన్డే సిరీస్‌లోకి తీసుకుంది బీసీసీఐ. భారత జట్టు నెట్ సెషన్స్‌లో వరుణ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు మంగళవారం నెట్టింట వైరల్‌గా మారాయి. తొలుత ప్రకటించిన టీమ్‌లో అతడు లేకపోవడంతో వరుణ్ అక్కడేం చేస్తున్నాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేసింది. వరుణ్‌ను ఈ సిరీస్‌ స్క్వాడ్‌లో కలుపుతున్నామని అనౌన్స్ చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అతడ్ని రీప్లేస్ చేస్తున్నట్లు వెల్లడించింది. నాగ్‌పూర్‌లో టీమ్‌తో అతడు జాయిన్ అయినట్లు పేర్కొంది.


ఇక తిరుగులేదు!

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 14 వికెట్లతో సత్తా చాటాడు వరుణ్. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును భయపెట్టాడు. దీంతో ఇంప్రెస్ అయిన బీసీసీఐ.. వన్డే టీమ్‌లోకి చాన్స్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆసీస్ టూర్‌లో గాయపడిన బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌ను తీసుకున్నారు. ఇంజ్యురీ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ ఫుల్ ఫామ్‌ అందుకోవడానికి సమయం పడుతుంది. అందుకే గన్ బౌలర్ ఉండాలనే ఉద్దేశంతో టీ20 సిరీస్‌లో రాణించిన వరుణ్‌ను జట్టులోకి తీసుకున్నారని సమాచారం. ఆల్రెడీ ఇంగ్లీష్ బ్యాటర్లతో ఆడుకుంటున్న ఈ స్పిన్ పిచ్చోడి రాకతో టీమిండియా దుర్బేధ్యంగా కనిపిస్తోందని.. రోహిత్ గట్టి ప్లానే వేశాడని నెటిజన్స్ అంటున్నారు.


ఇదీ చదవండి:

ఒక్క సిరీస్‌తో తక్కువ చేస్తే ఎలా?

ముంబై జట్టులో సూర్య, దూబే

అభిమాని అనుకుని పోలీసులు ఆపేశారు

మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 09:16 AM