IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 03:53 PM
India Playing 11: ఇంగ్లండ్‌తో వన్డే పోరాటానికి సిద్ధమవుతోంది టీమిండియా. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. అందులోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది.

టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇరు టీమ్స్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే సిరీస్ అవడంతో ఫామ్ అందుకోవడం, విజయాల బాట పట్టడం, స్క్వాడ్‌పై ప్రయోగాలు చేయడంతో పాటు వన్డేలకు అలవాటు పడేందుకు ఈ సిరీస్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బలంగా కనిపిస్తోంది. అనుభవం ఉన్న ఆటగాళ్లతో నిండిన టీమిండియా.. ఇంగ్లీష్ టీమ్‌ను తొక్కిపడేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో మన టీమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
నో ఎక్స్‌పెరిమెంట్స్!
తొలి వన్డేలో భారత్ ఎక్కువగా ప్రయోగాలు చేయాలని భావించడం లేదని తెలుస్తోంది. రెండు లేదా మూడో వన్డేలో ఎక్స్‌పెరిమెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా సీనియర్లతోనే మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగడం పక్కాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దిగుతారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్‌లో కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్ బాధ్యతలు చూసుకుంటారు. వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్ రోల్ పోషిస్తాడు. పేస్ బౌలింగ్ బాధ్యతల్ని అర్ష్‌దీప్ సింగ్‌తో కలసి మహ్మద్ షమి చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమి.
ఇదీ చదవండి:
చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం.. హింట్ ఇచ్చిన బీసీసీఐ
సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే
ముగ్గురు స్టార్లు ఔట్.. చాంపియన్స్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు
మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి