Share News

Rohit-Virat: సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:21 PM

IND vs ENG: టీమిండియా మూలస్తంభాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సిక్సుల జడివాన కురిపించారు. భారీ షాట్లతో బౌలర్లను భయపెట్టారు. బీస్ట్ మోడ్‌లోకి ఎంటరై.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేశారు.

Rohit-Virat: సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే
Rohit-Virat

అయిపోయిందేదో అయిపోయింది.. ఇక అంతా కొత్తగా మొదలుపెట్టాలని అనుకున్నారు. తమకు ఇష్టమైన ఫార్మాట్ కావడంతో బ్యాట్లు ఎత్తి బరిలోకి దిగారు. ఒకరికి పోటీగా మరొకరు భారీ సిక్సులతో విధ్వంసం సృష్టించారు. సొంత జట్టు ఆటగాళ్లు అని కూడా చూడకుండా చావబాదారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు.. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్‌ మైదానంలో. ఈ ఊచకోత కోసింది మరెవరో కాదు.. రోహిత్ కోహ్లీ-విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న ఈ టీమిండియా టాప్ స్టార్స్.. పోటీపడి భారీ షాట్లు బాదారు. అయితే అందుకు అసలు క్రెడిట్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఇవ్వాల్సిందే.


ఉతుకుడే మంత్రంగా..!

ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రోకో జోడీ.. ఇంగ్లండ్‌పై అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్‌తో జోష్‌లోకి వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఔట్-నాటౌట్ అనేది పట్టించుకోకుండా ఆ ఇద్దరూ భారీ షాట్లతో నెట్స్‌‌లో అదరగొట్టడం వెనుక కుర్రాడు అభిషేక్ ఆడిన నాకే కారణమని కామెంట్స్ చేస్తున్నారు. హిట్టింగ్‌తో ఇంగ్లీష్ టీమ్‌ను వణికించొచ్చు, ఒక్కసారి దంచుడు మొదలుపెడితే వాళ్లు డిఫెన్స్‌లో పడతారని అతడు ప్రూవ్ చేశాడు. అందుకే ఆ ఇన్నింగ్స్‌ స్ఫూర్తితో రోహిత్-కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో వీరబాదుడు మొదలుపెట్టారని అంటున్నారు. వాళ్ల ఉతుకుడు చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని నెటిజన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అసలైన ఊచకోత అంటే ఏంటో ఇప్పుడు అందరో చూడబోతున్నారని.. రోకో జోడీ వేట మొదలు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


ఇదీ చదవండి:

ముగ్గురు స్టార్లు ఔట్.. చాంపియన్స్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు

అభిషేక్‌తో నాకు పోలికేంటి.. శుబ్‌మన్ గిల్ సీరియస్

బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి స్పిన్ మాంత్రికుడు.. గట్టి ప్లానే

మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:24 PM

News Hub