Share News

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..

ABN , Publish Date - Feb 04 , 2025 | 01:08 PM

India vs England ODI Series Live Streaming: టీ20 సిరీస్‌తో ఆడియెన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది టీమిండియా. ఇప్పుడు వన్డే ఫైట్‌తో మరోమారు అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది.

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..
India vs England ODI Series

చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. అన్ని జట్లు ఈ టోర్నీకి ముందు పలు వన్డేలు ఆడుతూ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇన్నాళ్లూ టెస్టులు, టీ20లు ఆడుతూ సైలెంట్‌గా ఉన్న టీమిండియా కూడా ఒకేసారి టాప్ గేర్ వేసి బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్ జట్టుతో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైట్‌కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఈ రెండు టీమ్స్ మధ్య వన్డే సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్‌లో గెలవడంతో పాటు చాంపియన్స్ ట్రోఫీకి ముందు దీన్ని సన్నాహకంగా వాడుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. 50 ఓవర్ల ఫార్మాట్‌కు అలవాటు పడటమే కాదు.. స్క్వాడ్‌ను పూర్తి స్థాయిలో పరీక్షించుకోవడం, వ్యూహాలకు పదును పెట్టడానికీ దీన్ని సదవకాశంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు చూద్దాం..


షెడ్యూల్ ఇదే..

భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఫిబ్రవరి 6న స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీన రెండో వన్డే జరగనుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం ఈ మ్యాచ్‌ను హోస్ట్ చేయనుంది. ఆ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకే మొదలవుతుంది. సిరీస్‌లోని చివరి వన్డే ఫిబ్రవరి 12న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కూడా మిగతా వన్డేల మాదిరిగానే మధ్యాహ్నం 1.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అన్ని మ్యాచులు స్టార్ స్పోర్ట్స్‌, స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.


అందులోనే స్ట్రీమింగ్!

ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్ మ్యాచులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించొచ్చు. ఇక స్క్వాడ్స్ విషయానికొస్తే.. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో 14 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టులో హిట్‌మ్యాన్‌తో పాటు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీళ్లతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ కూడా స్క్వాడ్‌లో ఉన్నారు. వీళ్లలో నుంచి ప్లేయింగ్ ఎలెవన్‌ను రోహిత్ ఎలా ఎంచుకుంటాడో చూడాలి.


ఇదీ చదవండి:

స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్

బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్

ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 01:14 PM