Home » Royal Challengers Bangalore
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం (15/04/24) ఎం. చినస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం ఏడు గంటలకు టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ భంగార్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ..
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా royal challengers bangalore జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ(RCB) నాలుగో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచులో ఆర్సీబీ ఓటమికి ప్రధానంగా గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కింగ్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.