Home » Rushikonda
Andhrapradesh: రుషికొండలో అక్రమాలపై హైకోర్ట్‌లో అనుబంధ పిటిషన్ దాఖలైంది. పరిశీలనకు వచ్చిన కమిటీకి అక్రమాలపై పిటిషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశాఖ జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తరపున పిటిషన్ దాఖలైంది.
విశాఖ: రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గురువారం విశాఖపట్నం రానుంది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై ఏపీటీడీసీ నిర్మాణాలు చేపట్టిందని, పర్యాటక వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాలు నిర్మించిందని..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) రుషికొండను నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ( Bandaru Satyanarayanamurthy ) అన్నారు. శనివారం నాడు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
రుషికొండ ( Rushikonda ) లో జరిగిన విధ్వంసం, అక్రమాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) కమిటీని నియమించింది. నిపుణుడు గౌరప్పన్ ఆధ్వర్యంలో మొత్తం 5 గురు సభ్యులతో కమిటీని నియమించింది. సభ్యులుగా కోస్టల్ మేనేజ్మెంట్ ప్రతినిధిని నియమించింది.
రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై ఈరోజు(శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
రుషికొండ ( Rushikonda ) పై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ( Supreme Court ) లో రిట్ దాఖలు అయింది.
దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajoyothy) దెబ్బకు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) తోక ముడిచేశారు..! అప్పటి వరకూ నోటికొచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో మంత్రి విమర్శించారు..
‘మాట తప్పను.. మడమ తిప్పను’.. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ చెప్పే మాట ఇది. ఏదైనా ఓ నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి కదా..! తాను చెప్పిన మాటను తానే ఉల్లంఘిస్తే..? విశాఖ (Visakhapatnam)లోని రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్ వైఖరి ఇలాగే ఉంది. నాడు అక్రమ కట్టడమని ప్రజావేదిక (Prajavedika)ను కూల్చివే యించారు.
రుషికొండపై (Rushikonda) జగన్ సర్కార్ (Jagan Govt) చేపట్టిన నిర్మాణాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొండపై ఏం నిర్మాణాలు చేపడుతున్నాం అనేదానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన (YSRCP Vs TDP, Janasena) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి..
విశాఖ: నగరంలో ఆస్తులు హరించేస్తున్నారంటూ రుషికొండ వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రజల అస్తులు గోవిందా.. కొండలు గోవిందా... భూములు గోవిందా’ అంటూ నినాదాలు చేశారు.