Share News

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

ABN , Publish Date - Jun 16 , 2024 | 01:09 PM

రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాల‌స్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్‌ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

విశాఖపట్నం: రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాల‌స్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్‌ కోసమే! కట్టింది జనం ధనంతోనే..! ఇదీ నాడు ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్రధాన ఆరోపణ. సీన్ కట్ చేస్తే.. అసలు ఏంటీ రాజమహల్ రహస్యం..? ఇందులో ఏమేం ఉన్నాయ్..? అనే విషయాలు లోపలికి వెళ్లి పరిశీలిస్తే గానీ తెలియలేదు. ఇన్నాళ్లుగా నెలకొన్న రుషికొండపై ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడింది..

రహస్యం తెలిసిందిలే!

రుషికొండ (Rushikonda) రాజ మహల్ రహస్యం ఇవాళ(ఆదివారం) తెలిసిందని భీమిలి(Bheemili) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) అన్నారు. రుషికొండ భవనాలను పరిశీలించిన ఆయన ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు ఇక్కడికి వస్తే అడ్డుకున్నారని, కేసులు పెట్టారని మండిపడ్డారు. విశాఖ నుంచే జగన్ పరిపాలన చేస్తామని అప్పటి వైసీపీ ప్రభుత్వం అనేక ముహూర్తాలు పెట్టిందని, చివరికి ఘోరంగా ఓడిపోయిందన్నారు.

Sathya Kumar: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్..


ఆ ఇద్దరి భవనాలను మించి..?

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.." అమరావతి రాజధానిగా అసెంబ్లీలో జగన్ మద్దతు ఇచ్చి తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. పచ్చటి రుషకొండకు మాజీ సీఎం జగన్ బోడిగుండు కొట్టారు. దేశంలో ఇంత వివాదాస్పద భవనాలు ఎక్కడా కట్టలేదు.. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారు. లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చి రాజ భవనాలు నిర్మించారు. ప్రజావేదికకు అనుమతులు లేవని మాజీ సీఎం జగన్ సర్కార్ కూల్చివేసింది.. మరి రుషికొండకు ఏం అనుమతులు ఉన్నాయని కట్టారు. న్యాయస్థానానికి కూడా తప్పుడు సమాచారం అందించారు. సద్దాం హుసేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాలను మించి ప్రజా ధనంతో వీటిని కట్టారు. 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారు. వీటిని ఏం చేయాలోముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి నిర్ణయం తీసుకుంటాం. విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పినా.. ప్రజలు నమ్మలేదు. అందుకే విశాఖలో కూటమి అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ ఇచ్చి రాజధాని వద్దని తీర్పు ఇచ్చారు" అని అన్నారు.

ఇది కూడా చదవండి:

Kavali: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచరుడి అక్రమ లేఅవుట్‌ తొలగింపు..

AP Politics: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి: మంత్రి సత్యకుమార్

Updated Date - Jun 16 , 2024 | 01:46 PM