Home » Russia
యూనివర్సిటీలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తే.. రూ.92 వేలు బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
అగ్రరాజ్యం అమెరికాతో ఉన్న బంధాన్ని తేలికగా భావించొద్దని, తేలికగా కూడా తీసుకోవద్దని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా హెచ్చరికలు చేశారు.
రష్యా, ఆస్ట్రియా దేశాల అధికారిక పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ సోమవారం రష్యా, ఆస్ట్రియాలకు వెళ్లారు. పర్యటనలో మొదటి విడతలో ప్రధాని మాస్కోకు వెళ్లగా, రెండో చివరి దశలో వియన్నా వెళ్లారు.
భారత్-రష్యా భాగస్వామ్య ఒప్పందాలు, ఇరు దేశాల మధ్య స్నేహం వంటి కీలక విషయాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యాతో భారత్ బంధంపై తాము ఆందోళన చెందుతున్నామని చెబుతూనే.. భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగానే పరిగణిస్తున్నట్టు తెలిపింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'ను మంగళవారంనాడు అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం సరిగ్గా నెల రోజులకు తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటనలో భాగంగా ఆయన రష్యా పర్యటనకు వెళ్లడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుంది.
తన రష్యా పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రవాదంపై నిప్పులు చెరిగారు.
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యాలో రెండో రోజు మంగళవారం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని, భారత దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించిందని, భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందని మోదీ వ్యాఖ్యానించారు.
PM Narendra Modi in Russia: ఐదేళ్ల తరువాత రష్యాకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశం ఘన స్వాగతం పలికింది. రెండు రోజు పర్యటనలో భాగంగా రష్యాకు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడ విశేష స్వాగత సత్కారాలు లభించాయి. అయితే, ప్రధాని మోదీ రాక సందర్భంగా మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో రష్యన్ మహిళలు భాంగ్రా నృత్య ప్రదర్శన...
ప్రధాని మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రష్యాకి(Russia) చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని విమానం ల్యాండ్ కాగానే అక్కడి అధికారులు మోదీకి రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం తెలిపారు.