Home » Sachin Tendulkar
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్‌బాల్ వ్యూహం అంటూ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.
దేశంలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగగా అందులో సచిన్(sachin tendulkar ) పాల్గొని క్రికెట్ ఆడారు. ఆ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతోంది. అసలే కుబేరులు కావడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ఎల ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కుటుంబం పెళ్లి గురించే చర్చ జరుగుతోంది.
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్ పర్యటనలో ఆనందంగా గడుపుతున్నారు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాలన్నింటిని చుట్టేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తాను గతంలో చెప్పినట్టుగానే ప్రముఖ పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్‌ను కలిశాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్.. జమ్మూకశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీర్‌ను తన హోటల్ గదికి ఆహ్వానించాడు.
సచిన్ టెండూల్కర్. ఈ పేరుతో క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన పేజీలున్నాయి. తన ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దేశంలో అయితే సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. క్రికెట్‌కు సచిన్ చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నతో గౌరవించింది.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు రెండవ బిడ్డ జన్మించారని విరాట్ సోషల్ మీడియా వేదికగా నిన్న రాత్రి వెల్లడించారు. ఈ క్రమంలో సచిన్ సహా పలువురు ప్రముఖులు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంత మంది వినూత్నంగా పోస్టులు చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బద్దలుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన రూట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ సచిన్ రికార్డును అధిగమించాడు.
జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అతిరథ మహారథుల మధ్య ఒక పండుగలా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో.. ఈ వేడుకలో కొన్ని కీలక ఘట్టాలు కూడా చోటు చేసుకున్నాయి.