Nitish Kumar Reddy: నితీష్ రెడ్డికి అరుదైన గౌరవం.. సచిన్ సరసన తెలుగోడు..
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:14 PM
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. సూపర్బ్ నాక్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. ఇదే క్రమంలో ఓ అరుదైన గౌరవాన్ని కూడా అందుకున్నాడు.
IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. సూపర్బ్ నాక్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి సెన్సేషనల్ బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్లు ఫెయిలైన చోట.. 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేయడాన్ని మెచ్చుకుంటున్నారు. కాకలుదీరిన కమిన్స్, లియాన్, స్టార్క్‌ను ఎదుర్కొని నిలబడిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అన్నివైపుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న తెలుగోడు.. తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
హానర్స్ బోర్డులో..
150 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ ఆనవాయితీ ఉంది. ఆ స్టేడియంలో టెస్టుల్లో సెంచరీలు బాదిన విదేశీ బ్యాటర్ల పేర్లను హానర్స్ బోర్డులో నమోదు చేస్తారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం. తాజా మ్యాచ్‌లోనూ దీన్ని కంటిన్యూ చేశారు. టీమిండియా తరఫున శతకం బాదిన నితీష్ రెడ్డి పేరును ఈ హానర్స్ బోర్డులో చేర్చారు. గత పర్యటనలో ఇక్కడ సెంచరీ కొట్టాడు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె. దీంతో అతడి పేరు కింద నితీష్ పేరును చేర్చారు. ఈ మేరకు ఈ బోర్డును ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వాటే ఫీట్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ విజిటర్స్ హానర్స్ బోర్డులో నితీష్ పేరు ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఈ మైదానంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్, విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ తదితర భారత ఆటగాళ్లు సెంచరీలు బాదారు. ఇప్పుడు వాళ్ల సరసన చోటు దక్కించుకున్నాడు నితీష్. దీన్ని చూసిన నెటిజన్స్.. శభాష్ నితీష్ అంటూ తెలుగోడ్ని ప్రశంసిస్తున్నారు. 21 ఏళ్ల వయసులోనే తొలి ఆసీస్ పర్యటనలో ఇంతలా చెలరేగి ఆడటం, కంగారూ బౌలర్లకు నిద్ర లేకుండా చేయడం.. ఏకంగా సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాల సరసన హానర్స్ బోర్డులో బెర్త్ దక్కించుకోవడం మామూలు విషయం కాదని మెచ్చుకుంటున్నారు.
Also Read:
బుమ్రా పగబడితే ఇట్లుంటది.. బెయిల్స్ వెతకడానికి టైమ్ సరిపోదు..
అది ‘బాహుబలి’ ఫోజు కాదు.. సీక్రెట్ రివీల్ చేసిన నితీష్
కపిల్ దేవ్ రికార్డ్ చిత్తు చేసిన బుమ్రా.. మరో ఘనత కూడా..
ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..
For More Sports And Telugu News