Sachin Tendulkar: నాతో ఆడుకున్నాడు.. మనోడు అని నమ్మితే వేధించాడు: సచిన్
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:52 PM
Wankhede Stadium Celebrations: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఏ విషయమైనా ఆచితూచి మాట్లాడతాడు. నోటికి వచ్చింది చెప్పడం లాంటివి చేయడు. ఎవరినీ నొప్పించకుండా, అందరికీ నచ్చేలా మాట్లాడటం అతడి స్టైల్.

16 నవంబర్, 2013.. ఈ తేదీని భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. 24 ఏళ్ల పాటు టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జెంటిల్మన్ గేమ్ నుంచి నిష్క్రమించిన రోజు అది. వాంఖడే స్టేడియంలో సొంత అభిమానుల మధ్య వెస్డిండీస్‌తో జరిగిన టెస్ట్‌తో అతడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. సచిన్ చివరి ఇన్నింగ్స్, అతడికి ప్రత్యర్థి జట్టు గాడ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం, భారత ఆటగాళ్లు తమ భుజాలపై సచిన్‌ను మోస్తూ వెళ్లడం, సచిన్ పిచ్‌ను ముద్దాడటం, అభిమానులు.. సచిన్.. సచిన్ అంటూ ఎమోషనలైన మూమెంట్స్ ఇంకా ఫ్యాన్స్ కళ్ల ముందే కదలాడుతున్నాయి. అయితే ఆ రోజు ఓ ఘటన తనను చాలా ఇబ్బంది పెట్టిందన్నాడు క్రికెట్ దేవుడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
విండీస్‌కు ఫేవర్!
కెరీర్ లాస్ట్ టెస్ట్‌ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు సచిన్. తన తల్లి సమక్షంలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. ఆ క్షణాలు మళ్లీ రావన్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో కెమెరామెన్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని తెలిపాడు మాస్టర్ బ్లాస్టర్. అతడు తన ఎమోషన్స్‌తో ఆడుకున్నాడని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ జరుగుతోంది మన దగ్గర కాబట్టి కెమెరామెన్ మనోడు అని నమ్మితే.. అతడు ప్రత్యర్థి విండీస్‌కు ఫేవర్‌గా వర్క్ చేసినట్లు అనిపించిందన్నాడు.
డిస్ట్రబ్ అయ్యా!
‘నా ఆఖరి మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌కు దిగే టైమ్‌లో భావోద్వేగానికి గురయ్యా. వెస్టిండీస్ జట్టు నన్ను చాలా గౌరవించింది. స్టేడియంలోని ప్రేక్షకులు హర్షధ్వానాలతో స్వాగతించారు. అయితే కెమెరామెన్ మాత్రం నా ఎమోషన్స్‌తో ఆడుకున్నాడు. చివరి ఓవర్‌కు ముందు అతడు మా అమ్మతో పాటు భార్య అంజలి, పిల్లల్ని బిగ్ స్క్రీన్‌లో చూపించాడు. దీంతో నేను బ్యాటింగ్‌పై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయా. ఎమోషన్స్ నుంచి బయటపడలేకపోయా. మళ్లీ కుదురుకునేందుకు కొంచెం టైమ్ పట్టింది. కెమెరామెన్ వెస్టిండీస్‌కు సపోర్ట్‌గా ఉన్నట్లు అనిపించింది. బహుశా అతడికి విండీస్ పాస్‌పోర్ట్ ఇచ్చారేమో? ’ అని సచిన్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
నీరజ్ చోప్రా పెళ్లి వేడుక పిక్స్ వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి