Sara Tendulkar: సంద్రంలో సారా.. వెకేషన్‌లో క్రికెట్ గాడ్ డాటర్
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:59 PM
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి వల్ల వచ్చిన పాపులారిటీతో పాటు గ్లామర్‌తోనూ ఆమె మంచి క్రేజ్ సంపాదించింది.
Sachin Tendulkar: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి వల్ల వచ్చిన పాపులారిటీతో పాటు గ్లామర్‌తోనూ ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. టైమ్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలసి సారా వెకేషన్స్‌కు వెళ్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తోనూ కలసి బయటి దేశాల్లో విహరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియాలో దర్శనమిచ్చిందీ అందాల ముద్దుగుమ్మ. అక్కడి బీచ్‌ల్లో తెగ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టేడియంలో సందడి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచుల కోసం ఆసీస్‌లో వాలిపోయింది సారా. మూడో టెస్ట్‌లో ఆమె స్టేడియంలో తళుక్కుమంది. భారత జట్టు ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. ఆ మ్యాచ్‌లో ఆమె మీద కెమెరాలు ఎక్కువగా ఫోకస్ చేశాయి. మ్యాచ్ తర్వాత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఫ్యామిలీతో కలసి రెస్టారెంట్‌లో సారా దిగిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు సంద్రంలో సందడి చేస్తూ కనిపించింది క్రికెట్ గాడ్ డాటర్. బోట్ వేసుకొని హుషారుగా సముద్రంలో రైడ్ చేస్తూ హల్‌చల్ చేసింది. ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్స్.. వెకేషన్ అదిరింది సారా అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు.. నితీష్‌పై పవన్ రియాక్షన్
నితీష్ రెడ్డికి అరుదైన గౌరవం.. సచిన్ సరసన తెలుగోడు..
బుమ్రా పగబడితే ఇట్లుంటది.. బెయిల్స్ వెతకడానికి టైమ్ సరిపోదు..
అది ‘బాహుబలి’ ఫోజు కాదు.. సీక్రెట్ రివీల్ చేసిన నితీష్
For More Sports And Telugu News