Home » Sachin Tendulkar
రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.
Arjun Tendulkar: రంజీ ట్రోఫి 2024లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్లో అర్జున్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా కర్ణాటకతో మొదలైన మ్యాచ్‌లో జట్టును కష్టకాలంలో ఆదుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లంతా కలిసి ఆడిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు, అన్నాదమ్ములైన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Sachin Tendulkar: భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. రెండు జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. రెండు జట్ల మధ్య చివరగా జరిగిన టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగింది.
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట కలకలం రేపుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందిస్తున్న ఈ మార్ఫింగ్ వీడియోలు చాలా మందికి తలనొప్పి తెస్తున్నాయి. కొద్ది రోజుల కిందట హీరోయిన్లు రష్మిక, కాజోల్ వంటి హీరోయిన్లు ఇలాంటి వీడియోలపై ఫిర్యాదులు చేశారు.
అయోధ్య రామాలయంలో ఈనెల 22న జరుగున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 11,000 మంది ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది.
అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది.
భారత్, సౌతాఫ్రికా మధ్య మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు వికెట్లు నేలకూలాయి. పిచ్‌పై బౌన్స్ లభించడంతో పండుగ చేసుకున్న రెండు జట్ల పేసర్లు బఠాణీలు తిన్నంత సులువుగా వికెట్లు పడగొట్టారు. ఒకానొక దశలో పరుగుల కంటే ఎక్కువగా వికెట్లే వచ్చాయి.
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిపాలడంపై క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
స్టార్ ఆటగాళ్ల పంట పండింది. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు సహా నిఖత్ జరీన్ పెట్టుబడులు పెట్టిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వీరికి కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది.