Viral Video: బాలిక బౌలింగ్‌కు సచిన్ ఫిదా.. వీడియోను షేర్ చేస్తూ ఏమన్నారంటే..
ABN , Publish Date - Dec 22 , 2024 | 07:31 AM
ప్రతి ఒక్కరిలో ఓ టాలెంట్ ఉంటుంది. సందర్భాన్ని బట్టి అది బయటికి వస్తూ ఉంటుంది. ఒకప్పుడంటే ఇలాంటి టాలెంట్ గురించి బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసేది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో మారుమూల పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
ప్రతి ఒక్కరిలో ఓ టాలెంట్ ఉంటుంది. సందర్భాన్ని బట్టి అది బయటికి వస్తూ ఉంటుంది. ఒకప్పుడంటే ఇలాంటి టాలెంట్ గురించి బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసేది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో మారుమూల పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ పల్లెటూరి బాలిక బౌలింగ్ చేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ బాలిక బౌలింగ్‌కు ఏకంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కరే ఫిదా అయ్యారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) చోటు చేసుకుంది. ప్రతాప్ గఢ్ జిల్లా ధరియావద్ తహసీన్‌లోని రామేర్ తలాబ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సుశీల మీనా అనే బాలిక (girl) .. స్కూల్ డ్రెస్ ధరించి క్రికెట్ ఆడుతోంది. ఈ సందర్భంగా ఆ బాలిక ఫాస్ట్ బౌలింగ్ (Fast bowling) చేసి అందరినీ ఆకట్టుకుంది. మెరుపువేగంతో పరుగెడుతూ బౌలింగ్ చేసిన ఈ బాలికను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కొందరు ఈ బాలికను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో.. చివరకు క్రికెట్ దేవుడిగా పిలవబడే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) దృష్టికి వెళ్లింది. ఈ వీడియోను చూడగానే ఆయన కూడా ఫిదా అయ్యారు. బాలిక బౌలింగ్ చేసిన విధానం చూసి ఎంతో ముచ్చటపడిపోయాడు. వెంటనే ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ‘‘ఈ బాలిక బౌలింగ్ యాక్షన్ అద్భుతంగా ఉంది. చాలా స్కూత్, ఎఫెక్టివ్ బైలింగ్.. అచ్చం జహీర్ ఖాన్‌లాగే బౌలింగ్ చేస్తోంది..’’.. అంటూ ప్రశంచించారు. అలాగే ఈ వీడియోను చూడమంటూ జహీర్ ఖాన్‌ను ట్యాగ్ చేశారు.
Viral Video: ఇదేం విన్యాసంరా బాబోయ్.. మూర్ఖత్వానికి పరాకష్ట అంటే ఇదేనేమో..
సచిన్ టెండూల్కర్ షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ బాలికకు శిక్షణ ఇస్తే మంచి క్రికెటర్ అవుతుంది’’.. అంటూ కొందరు, ‘‘భారత మహిళా క్రికెట్ జట్టుకు.. మరో జహీర్‌ఖాన్ దొరికినట్లే’’.. అంటూ మరికొందరు, ‘‘క్రికెట్ దేవుడి దృష్టిలో పడ్డావు.. ఇక నీ కష్టాలు తీరినట్లే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 21 లక్షలకు పైగా లైక్‌లు, 2.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..