Sara Tendulkar: చదివింది లండన్‌లో.. చేసేది ఆ పనా.. సారా టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:55 PM
ముంబైలోని స్టార్ కిడ్స్ ఎంతో మంది చేయలేని పని సచిన్ కుమార్తె చేస్తోందంటూ నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. లండన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన కూతురికి సచిన్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పాడంటే..

ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కొత్త బాధ్యతలు చేపట్టింది. తన తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు ఆమె సిద్ధమైంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ గా తన కూతురు సారాను నియమిస్తున్నట్టుగా ఇవాళ ప్రకటించారు. ఈ విషయాన్ని క్రికెట్ దిగ్గజం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ ఫౌండేషన్ దర్వారా మారుమూల గ్రామాల్లోని పిల్లలకు వైద్య సేవల అందించడమే కాకుండా వారిలో పోషకాహారా లోపాన్ని సైతం తగ్గించేలా ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల లండన్ యూనివర్సిటీలో క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ ఫౌండేషన్ బాధ్యతలు తన కూతురు చేపట్టడం సంతోషంగా ఉందని సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కుమార్తెకు వైద్య, విద్యా రంగంపై ఉన్న నాలెడ్జ్ సమాజానికి ఉపయోగపడటం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా ఆయా గ్రామంలోని పలువురు చిన్నారులతో సారా తీసుకున్న ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. సారా తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదంటూ ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.