Share News

Aaditya Thackeray: బీజేపీకి 'బీ టీమ్'లా వ్యవహరిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ

ABN , Publish Date - Dec 08 , 2024 | 09:42 PM

సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, కానీ కొన్ని సార్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం మాత్రం బీజేపీ బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆదిత్య థాకరే తప్పు పట్టారు.

Aaditya Thackeray: బీజేపీకి 'బీ టీమ్'లా వ్యవహరిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ

ముంబై: బాబ్రీ మసీదు కూల్చేవేత పనికి గర్విస్తున్నామని ఉద్ధవ్ థాకరే సన్నిహితుడు మిలింద్ నార్వేకర్ చేసిన ప్రకటన 'మహా వికాస్ అఘాడి' (MVA)లో చిచ్చురేపడం, కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ఎస్పీ రాష్ట్ర విభాగం నేత అబు అజ్మీ ప్రకటించడంపై శివసేన (UBT) నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే ఘాటుగా స్పందించారు. ఎస్పీ నేత అబు అజ్మీ కొన్ని సార్లు బీజేపీకి 'బీ టీమ్'లా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు.

Sonia Gandhi: సోనియాగాంధీ-జార్జి సోరోస్ సంబంధాలపై బీజేపీ సంచలన ఆరోపణ


కొన్ని సార్లు మహారాష్ట్ర ఎస్‌పీ రాష్ట్ర విభాగం బీజేపీకి బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆదిత్య అన్నారు. అఖిలేష్ యాదవ్ (ఎస్‌పీ జాతీయ అధ్యక్షుడు) బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, కానీ కొన్ని సార్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం మాత్రం బీజేపీ బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని తప్పు పట్టారు. బీ టీమ్‌లు తమకు పాఠాలు నేర్పకూడదని అన్నారు. శివసేన (యూబీటీ) హిందుత్వం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. బీజేపీ ''సబ్ కా సాత్, సబ్‌కా వికాస్'' అంటూ మాట్లాడుతుందని, మేము మాత్రం ఆ పని చేసి చూపిస్తున్నామని ఉన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తున్నామని, ఉద్ధవ్ థాకరే చేస్తున్నది కూడా అదేనన్న విషయం మహారాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.


అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమి ఘనవిజయం సాధించడంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి'లో స్పర్ధలు తలెత్తిన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే బాబ్రీ మసీదు కూల్చివేతను పొగిడిన 'ఎంవీఏ'తో తాము కలిసుండరాదని నిర్ణయించామని, ఇదే విషయం అఖిలేష్ కూడా చెప్పామని అబు అజ్మీ శనివారంనాడు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

Viral News: పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్.. అడ్డుకున్న పోలీసులు

Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 08 , 2024 | 09:45 PM