Ayodhya: రాజీనామా చేస్తా.. అయోధ్య ఎంపీ సంచలన ప్రకటన
ABN , Publish Date - Feb 02 , 2025 | 02:58 PM
గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన దళిత మహిళ ఆ గ్రామానికి 500 మీటర్ల దూరంలోని ఒక కాలువలో మృతదేహంగా శనివారం ఉదయం కనిపించింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై పలు చోట్ల లోతైన గాయాలు, ఫ్రాక్చర్లు ఉన్నాయని, కళ్లు తీసేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya)లో 22 ఏళ్ల దళిత యువతి దారుణ హత్య సంచలనమైంది. బాధిత కుటుంబాన్ని కలిసిన సమాజ్‌వాద్ పార్టీ అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ (Awadesh Prasad) ఈ ఘటనపై ఆదివారంనాడు ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో ఒక్కసారిగా గుక్కపెట్టి ఏడ్చారు. ''ఆమెను కాపాడలేకపోయాను, నేను రాజీనామా చేస్తాను'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పక్కనే ఉన్న మాజీ మంత్రి నారాయణ్ పాండే పవన్, ఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఆయనను ఊరడించే ప్రయత్నం చేశారు. మృతురాలి కోసం పోరాడాలని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీనికి ఆయన వెంటనే స్పందిస్తూ, ఢిల్లీ వెళ్తాను.. లోక్‌సభలో ప్రధాని ముందు ఈ అంశం లేవనెత్తుతాను, ఆ విషయంలో న్యాయం జరక్కుండే లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటూ కంటతడి పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Baba Ramdev: యోగా గురువు బాబా రాందేవ్‌పై అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే..
ఏం జరిగింది?
గత గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన దళిత మహిళ ఆ గ్రామానికి 500 మీటర్ల దూరంలోని ఒక కాలువలో మృతదేహంగా శనివారం ఉదయం కనిపించింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై పలు చోట్ల లోతైన గాయాలు, ఫ్రాక్చర్లు ఉన్నాయని, కళ్లు తీసేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలి వద్దే జరిగిన దారుణం చూసి మృతురాలి సోదరి, ఇద్దరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు.
కాగా, శుక్రవారం రాత్రి యువతి కనిపించకుండా పోయినట్టు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామని, మృతదేహం కనిపించడంతో పోస్ట్‌మార్టం కోసం పంపామని, రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు తీసుుంటామని సర్కిల్ ఆఫీసర్ అషుతోష్ తివారి తెలిపారు. అయితే పోలీసులకు సకాలంలో ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలికి పెద్దఎత్తున చేరుకున్న గ్రామస్థులు బాధితురాలికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసుపై విచారణ జరుపుతున్న పోలీసులు బాధ్యులైన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి