Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:45 PM
ఛత్రపతి శివాజీ మహరాజ్, సంభాజీ మహరాజ్ గురించి కానీ ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ తాను ఎలాంటి కించపరచే వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వాటిని వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా ఉన్నానని అబూ అజ్మీ తెలిపారు.

ముంబై: మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ (Aurangzebg) గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ''నా వ్యాఖ్యలను వక్రీకరించారు. చరిత్రకారులు, రచయితలు ఔరంగజేబ్ రహ్మతుల్లా అలి గురించి ఏమి చెప్పారో అదే నేనూ చెప్పాను'' అని ఆయన వివరణ ఇచ్చారు.
Aurangzeb Row: ఔరంగజేబ్ గొప్ప పాలకుడు.. ఎస్పీ నేత వ్యాఖ్యలపై దుమారం
శివాజీ, సంభాజీని కించపరచలేదు..
ఛత్రపతి శివాజీ మహరాజ్, సంభాజీ మహరాజ్ గురించి కానీ ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ తాను ఎలాంటి కించపరచే వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వాటిని వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా ఉన్నానని అబూ అజ్మీ ఒక వీడియాను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ అంశాన్ని రాజకీయం చేస్తే మహారాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు
కాగా, ఔరంగజేబుపై వ్యాఖ్యల నేపథ్యంలో అబు అజ్మీపై మంగళవారం ఉదయం థానేలోని నౌపద పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం దీనిని ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఔరంగజేబును గొప్ప పాలకుడని పొగుడుతూ అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో అబు అజ్మీ తొలుత తన వ్యాఖ్యలను సమర్ధంచుకునే ప్రయత్నం చేశారు. ఔరంగజేబ్ ఆలయాలతో పాటు మసీదులను కూడా ధ్వంసం చేశారని అన్నారు. ఔరంగజేబ్ హిందూ వ్యతిరేకి కాదన్నారు. ఆయన పాలనాయంత్రాగంలో 34 శాతం మంది హిందువులు ఉన్నారని, అనేక మంది హిందువులు సలహాదారులుగా ఉన్నారని చెప్పారు. ఈ అంశాన్ని మతం కోణంలో చూడరాదన్నారు. మరోవైపు, అబు అజ్మి వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ముఖ్యమంత్రి సైతం ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.