Rana Sanga Row: రాణా సంగపై వ్యాఖ్యలు.. సమాజ్‌వాదీ ఎంపీ నివాసంపై కర్ణిసేన దాడి
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:26 PM
రాణా సంగాపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ మధ్యప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కర్ణిసేన సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీ ముఖానికి నల్లరంగు పూసి, చెప్పులతో కొట్టిన వ్యక్తికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని కూడా కర్ణిసేన రాష్ట్ర విభాగం ప్రకటించింది.

ఆగ్రా: రాజ్‌పుత్ పాలకుడు రాణా సంగ (Rana Sanga)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎంపీ రామ్జీలాల్ సుమన్ (Ramji Lal Suman)పై కర్ణిసేన (Karni Sena) కార్యకర్తలు కన్నెర్ర చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో ఉన్న రామ్జీలాల్ నివాసంపై బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు. కర్ణిసేన సభ్యులు బుల్డోజర్ తీసుకుని ఆయన నివాసానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Kunal Kamra Joke Row: కునాల్ కామ్రాకు రెండోసారి నోటీసులు.. మరింత గడువుకు నిరాకరణ
దీనికిముందు, రాణా సంగాపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ మధ్యప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కర్ణిసేన సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీ ముఖానికి నలుపురంగు పూసి, చెప్పులతో కొట్టిన వ్యక్తికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని కూడా కర్ణిసేన రాష్ట్ర విభాగం ప్రకటించింది.
కాగా, భోపాల్‌లోని తులసీ నగర్ ప్రభుత్వ క్వార్టర్‌లో ఉన్న తమ పార్టీ కార్యాలయంపై నిరసనకారుల దాడిని ఎస్పీ మధ్యప్రదేశ్ యూనిట్ ఖండించింది. కార్యాలయం వెలుపల ఉన్న పార్టీ బ్యానర్లు, పోస్టర్లు ధ్వంసం చేసినట్టు చెప్పింది. టీటీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సుంధీర్ అర్జారియా మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు దిష్టిబొమ్మను తగులబెట్టినట్టు చెప్పారు. బ్యానర్లు, పోస్టర్లు ధ్వంసం ఏమీ జరగలేదని, చిన్నపాటి నిరసన మాత్రమే తెలిపారని, కేసు ఏమీ పెట్టలేదని చెప్పారు. ఉదయం 7.15 గంటలకు నిరసనకారులు దాడికి పాల్పడినట్టు సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రతినిధి యష్ భారతీయ తెలిపారు.
రాణా సంగపై రామ్జీలాల్ సుమన్ ఏమన్నారు?
ఈనెల 21న రాజ్యసభలో రామ్జీలాల్ సుమన్ మాట్లాడుతూ, రాజ్‌పుత్ పాలకుడు రాణా సంగను 'దేశద్రోహి' అని విమర్శించారు. భారతీయ ముస్లింలు బాబర్‌ను ఆదర్శంగా భావించరని, అసలు ఇబ్రహీం లోడిని ఓడించడానికి బాబర్‌ను భారతదేశానికి ఆహ్వానించనది మేవార్ పాలకుడేనని అన్నారు. అలాంటి రాణా సంగను హిందువులు ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. ముస్లింలను బాబర్ వారసులని పిలిస్తే హిందువులు 'దోశద్రోహి' రాణా సంగ వారసులు అయి ఉండాలన్నారు. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంస్థలు తీవ్ర నిరసన తెలిపాయి. తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలను ఆ పార్టీ సుప్రీం అఖిలేష్ యాదవ్ సమర్ధిస్తూ, చరిత్రలోని ఒక అంశాన్నే ఎంపీ ప్రస్తావించారని, చరిత్రను తామేమీ రాయలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి..