Home » SBI
డిగ్రీ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 12వ బ్యాచ్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు రూ.70 వేల వరకు అందిస్తుంది.
రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే ఎలక్టోరల్ బాండ్లను మోదీ సర్కార్ (Modi Govt) తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. SBI బ్యాంకు అధికారుల వెనుక కేంద్రపెద్దలున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
Supreme Court of India: ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో ఎస్బిఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్బిఐకి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.
గడిచిన 5 ఏళ్లలో పలు రాజకీయ పార్టీలకు వెళ్లిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) విషయాలు బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఎస్బీఐను ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎస్బీఐ ఓ పెన్ డ్రైవ్‌లో బాండ్ల వివరాలు సమర్పించింది. ఎలక్టోరల్ బాండ్స్ డేటా సమర్పించాలని సుప్రీం కోర్టు రెండు రోజులు గడువు విధించింది.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను రేపు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సిందేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుపీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్ల వివరాలు తెలియజేసేందుకు తాము మరింత సమయం ఇవ్వాలని ఎస్బీఐ తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అందుకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana: అన్నం పెట్టిన బ్యాంకునే కన్నం వేశారు ఆ బ్యాంకు మేనేజర్లు. లోన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మరీ మోసానికి పాల్పడుతూ దాదాపు రూ.2.80 కోట్లు కాజేశారు. ఈ ఘటన నగరంలోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు మేనేజర్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాభాలు భారీగా పతనమయ్యాయి. శనివారం ప్రకటించిన FY24 క్యూ3 త్రైమాసికంలో SBI లాభం ఏకంగా 35 శాతం కోల్పోయి రూ. 9,163 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించారు.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధుల కోసం గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) సహా వ్యక్తులందరికీ ఈ పథకం అందుబాటులో ఉందని బ్యాంక్ తెలిపింది.
ఈ రోజుల్లో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికీ ఖాతాలు ఉండడం సహజం. చాలా మందికి ఒకటికి మించే బ్యాంకు ఖాతాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బులను ఎవరూ ఇంట్లో దాచుకోవడం లేదు. చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం బ్యాంకులోనే దాచుకుంటున్నారు.