SBI PO Results: ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..ఇక్కడ క్లిక్ చేసి, ఇలా తెలుసుకోండి..
ABN , Publish Date - Apr 05 , 2025 | 06:59 PM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి సంబంధించిన PO ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షల్లో హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింద చెప్పిన వివరాల ఆధారంగా సులభంగా తెలుసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI PO ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు శనివారం (ఏప్రిల్ 5, 2025) విడుదలయ్యాయి. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ క్లిక్ చేసి https://sbi.co.in/web/careers/recruitment-results తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీ వివరాలతో ఫలితాల గురించి తనిఖీ చేసుకోవచ్చు. అయితే దీని కోసం అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్/రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించాలి. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించడం ద్వారా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
SBI PO ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను https://sbi.co.in/web/careers/recruitment-results సందర్శించాలి
ఆ తర్వాత అభ్యర్థులు హోమ్‌పేజీలోని కెరీర్ లింక్‌పై క్లిక్ చేయాలి
దీని తరువాత అభ్యర్థులు కరెంట్ ఓపెనింగ్స్‌పై క్లిక్ చేయాలి
అలా చేసిన తర్వాత ఒక ప్రత్యేక పేజీ తెరుచుకుంటుంది. అక్కడ అభ్యర్థులు SBI PO ప్రిలిమ్స్ ఫలితం 2025 లింక్‌పై క్లిక్ చేయాలి
ఆ తర్వాత అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేస్తే కొత్త విండో తెరుచుకుంటుంది
ఆ క్రమంలో మీకు మీ ఫలితాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి
ఇప్పుడు అభ్యర్థులు దానిని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి
చివరగా, అభ్యర్థులు ఫలితాన్ని ప్రింటవుట్ తీసుకోవాలి
మెయిన్స్ కోసం సిద్ధం కావాలి..
SBI PO ప్రిలిమినరీ పరీక్ష ఎంతో కఠినమైన పరీక్షగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో అడిగే ప్రశ్నలు సాధారణంగా ఎక్కువ మంది అభ్యర్థులకు మంచి సవాలుగా మారతాయి. మూడు విభాగాలు కూడా అభ్యర్థులందరి సామర్థ్యాలను పరీక్షించే విధంగా రూపొందించబడ్డాయి. ఇంగ్లీష్ ప్రశ్నలు అభ్యర్థుల సమగ్రంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం గణితం, లెక్కలతో నిండి ఉంటుంది. రీజనింగ్ ఇందులోని ప్రశ్నలు మీ లాజికల్ భావనను పరీక్షిస్తాయి. SBI PO 2025 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగించాలి. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ (PI) కూడా కీలకం కాబట్టి దీనిపై కూడా కొంత సమయం కేటాయించాలి.
వ్యవధి 60 నిమిషాలు
ఈ పరీక్ష 2025 మార్చి 8, 16, 24, 26 తేదీల్లో నిర్వహించారు. ఇందులో 100 మార్కుల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉన్నాయి. పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించబడింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు విభాగాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు అడిగారు. గరిష్టంగా 100 మార్కులు కాగా, ఈ పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కులలో 1/4 వంతు తగ్గించబడుతుంది. అభ్యర్థి ఏ సమాధానాన్ని గుర్తించకపోతే, ఆ ప్రశ్నకు రుణాత్మక మార్కులు ఉండవు.
ఇవి కూడా చదవండి:
CBHFL Jobs: డిగ్రీ చేసిన ఉద్యోగార్థులకు జాబ్ ఆఫర్స్..45 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News