FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:14 PM
దేశంలో అనేక మంది పౌరులు ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ సహా పలు రకాల బ్యాంకుల్లో FD చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఎస్బీఐ, ప్రైవేటు రంగ బ్యాంకైన యాక్సిస్ బ్యాంకుల్లో FD చేస్తే వీటిలో దేనిలో ఎక్కువ వడ్డీ లభిస్తుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

దేశంలో ప్రధానంగా సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లకు ప్రాముఖ్యత ఇస్తారు. దీంతోపాటు మరి కొంత మంది సాధారణ పౌరులు రిస్క్ లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐలో అనేక మంది వారి పెట్టుబడులను చేస్తారు. మరికొంత మంది ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంకులో కూడా వారి డిపాజిట్లు చేస్తారు. ఈ నేపథ్యంలో 6 లక్షలు, రూ. 10 లక్షల పెట్టుబడులను మూడేళ్లపాటు దేనిలో FD చేస్తే ఎక్కువగా వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
SBI 3 సంవత్సరాల FD వడ్డీ రేట్లు
సాధారణ పౌరులకు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సంవత్సరాల FDకి 6.75% వడ్డీ రేటును అందిస్తుంది.
సీనియర్ పౌరులకు: సీనియర్ పౌరులకు SBI వడ్డీ రేటు 7.25%గా ఉంది
Axis బ్యాంక్ 3 సంవత్సరాల FD వడ్డీ రేట్లు
సాధారణ పౌరులకు: యాక్సిస్ బ్యాంక్ 3 సంవత్సరాల FDకి 7.10% వడ్డీ రేటును అందిస్తుంది.
సీనియర్ పౌరులకు: సీనియర్ పౌరులకు Axis వడ్డీ రేటు 7.60%గా ఉంది.
6 లక్షల పెట్టుబడితో..
మీరు SBIలో 6 లక్షల రూపాయలను 3 సంవత్సరాల FDలో పెట్టుబడి చేస్తే వచ్చే మొత్తం మెచ్యూరిటీ విలువ రూ. 7,33,435 అవుతుంది. ఈ పెట్టుబడిపై మీరు సంపాదించే వడ్డీ మొత్తం రూ. 1,33,435 అవుతుంది. అదే సమయంలో సీనియర్ పౌరులు SBIలో రూ. 6 లక్షలు పెట్టినప్పుడు, వారి అంచనా మెచ్యూరిటీ విలువ రూ. 7,44,328 అవుతుంది. వడ్డీ ద్వారా మొత్తం రూ. 1,44,328 అందుతుంది.
రూ. 10 లక్షల పెట్టుబడిపై వడ్డీ
సాధారణ పౌరుల కోసం SBIలో రూ. 10 లక్షలు పెట్టినప్పుడు, మీకు వచ్చే మొత్తం విలువ రూ. 12,23,892 అవుతుంది. ఇందులో మీరు పొందే మొత్తం వడ్డీ రూ. 2,23,892గా ఉంది. ఇక సీనియర్ పౌరుల కోసం అయితే SBIలో రూ. 10 లక్షలు పెట్టినప్పుడు, ఆ మెచ్యూరిటీ మొత్తం విలువ రూ. 12,40,546 కాగా, దీనిలో వడ్డీ రూపంలో వచ్చేది రూ. 2,40,546 ఉంటుంది.
Axis బ్యాంక్ 3 సంవత్సరాల FD
సాధారణ పౌరుల కోసం అయితే యాక్సిస్ బ్యాంక్‌లో 6 లక్షల రూపాయల FD చేసినప్పుడు వచ్చే మొత్తం విలువ రూ. 7,41,045 అవుతుంది. మీరు ఈ FD ద్వారా సంపాదించే వడ్డీ మొత్తం రూ. 1,41,045గా ఉంటుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్ల కోసం అయితే యాక్సిస్ బ్యాంక్‌లో 6 లక్షలు FD చేసినప్పుడు వచ్చే మొత్తం విలువ రూ. 7,52,040 కాగా, వడ్డీ రూపంలో రూ. 1,52,040 వస్తుంది.
Axis బ్యాంక్ 3 సంవత్సరాల FD: రూ. 10 లక్షల పెట్టుబడిపై వడ్డీ
సాధారణ పౌరుల కోసం: Axis బ్యాంక్‌లో రూ. 10 లక్షలు పెట్టినప్పుడు, వచ్చే మొత్తం రూ. 12,35,075 అవుతుంది. ఈ క్రమంలో వడ్డీ రూపంలోనే రూ. 2,35,075 లభిస్తాయి. మరోవైపు సీనియర్ పౌరులు Axis బ్యాంక్‌లో రూ. 10 లక్షలు పెట్టినప్పుడు, వారికి లభించే మెచ్యూరిటీ విలువ రూ. 12,53,401 అవుతుంది. ఆ క్రమంలో వడ్డీ రూపంలోనే రూ. 2,53,401 లభిస్తాయి.
SBI vs Axis: ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు?
సాధారణ పౌరులకు:
SBI: 6 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 1,33,435, 10 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 2,23,892
Axis: 6 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 1,41,045, 10 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 2,35,075
Axis బ్యాంక్, సాధారణ పౌరుల కోసం, SBIతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ వడ్డీ ఇస్తుంది.
సీనియర్ పౌరులకు:
SBI: 6 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 1,44,328, 10 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 2,40,546
Axis: 6 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 1,52,040, 10 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 2,53,401
ఇవి కూడా చదవండి:
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News