Home » Schools
పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును విడుదల చేసింది. ఈ గ్రాంటు కింద వచ్చే మొత్తంతో పాఠశాలల నిర్వహణలో భాగంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లతో పాటు, మోడల్ స్కూళ్లలో గదులు, మురుగుదొడ్ల శుభ్రత, ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోయడం, బడి పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులను నిర్వహిస్తారు.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.
ప్రైవేటు స్కూళ్లలో పదోతరగతి ఫెయిల్ అయినవారే ఉపాధ్యాయులుగా ఉన్నారంటూ.. వారిని అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కారం మెతుకులతో కడుపు నింపుకోవాల్సిందేనా.. మధ్యాహ్న భోజనంలో ఏం పెడుతున్నారు.. పిల్లలకు అందించే మెనూపై ప్రభుత్వం స్పందించాలని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్ బ్యూరో(Bureau of Narcotics) అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు.
నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్‌పై ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు శుక్రవారం దాడి చేశారు. అదే పాఠశాల హాస్టల్లో ఉంటున్న తమ చిన్నారులపై ఆయన కొన్నాళ్లుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆంజనేయులు గౌడ్ వయసు 77 ఏళ్లు. విద్యాసంస్థల నిర్వహణతోపాటు సాహితీ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నగరవాసులకు సుపరిచితులు. ఆయనపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లారు. నాలుగు, ఐదో ...
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ కిచెన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ప్రాథమిక పాఠశాల పనివేళల మాదిరిగానే హైస్కూల్ పనివేళలూ ఉంటాయి.