Bhatti Vikramarka: ఎడ్యుకేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 23 , 2024 | 05:58 PM
ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు.
హైదరాబాద్: ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్యకంటే నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించారు.
ఈరోజు (మంగళవారం) తెలంగాణ సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... ఒక్కో పాఠశాల కోసం రూ.80 నుంచి రూ. 100 కోట్లు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ టైప్ ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయని చెప్పారు. ప్రతీ మండలానికి రెండు లేదా మూడు పాఠశాలలు తొలుత రాబోతున్నాయని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడొద్దని హితవు పలికారు.
రుణమాఫీపై ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. బీఏసీలో బీఆర్ఎస్ నేతలు పేర్లు మార్చుకున్నారని.. అందుకే ఆ సమావేశం ఆలస్యమైందని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి
TS Assembly: గట్టి కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ.. నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ
Read Latest Telangana News And Telugu News