Share News

CM Revanth Reddy: ప్రైవేటు టీచర్లను అవమానించేలా సీఎం వ్యాఖ్య

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:42 AM

ప్రైవేటు స్కూళ్లలో పదోతరగతి ఫెయిల్‌ అయినవారే ఉపాధ్యాయులుగా ఉన్నారంటూ.. వారిని అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు.

CM Revanth Reddy: ప్రైవేటు టీచర్లను అవమానించేలా సీఎం వ్యాఖ్య

  • మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు స్కూళ్లలో పదోతరగతి ఫెయిల్‌ అయినవారే ఉపాధ్యాయులుగా ఉన్నారంటూ.. వారిని అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో కూడా అధికశాతం శిక్షణ పొందిన ఉపాధ్యాయులే పనిచేస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు.


ప్రభుత్వ ఉపాధ్యాయుల మెప్పుకోసం ప్రైవేటు ఉపాధ్యాయులను కించపరిచేలా సీఎం వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పోటీ ప్రపంచంలో చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని, సీఎం రేవంత్‌ సైతం తన మనవలు, మనవరాళ్లను ప్రైవేటు స్కూళ్లకు పంపే పరిస్థితి ఉంటుందన్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్లడానికి గల కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

Updated Date - Aug 05 , 2024 | 03:42 AM