School Timings: హైస్కూల్ వేళల్లో మార్పు..
ABN , Publish Date - Jul 21 , 2024 | 03:54 AM
రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ప్రాథమిక పాఠశాల పనివేళల మాదిరిగానే హైస్కూల్ పనివేళలూ ఉంటాయి.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 దాకా
ఇక ప్రాథమిక పాఠశాలల మాదిరిగానే..
జంట నగరాల పరిధిలో పాత వేళలే
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ప్రాథమిక పాఠశాల పనివేళల మాదిరిగానే హైస్కూల్ పనివేళలూ ఉంటాయి. శనివారం దాకా ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30కు మొదలై సాయంత్రం 4:45 దాకా నడిచాయి! అయితే తాజా షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఉన్నత పాఠశాలలు కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి.
సాయంత్రం 4:15 గంటలకు పనివేళలు ముగుస్తాయి. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి హైదరాబాద్- సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని స్కూళ్లు మాత్రం మినహాయింపు! అంటే ఇక్కడ ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పాఠశాలలు కొనసాగుతున్నాయి.